- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ranga Reddy: కోట్లకు పడగలెత్తిన అధికారి.. మాజీ జాయింట్ రిజిస్ట్రార్ కె.మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు
రంగారెడ్డి జిల్లా మాజీ జాయింట్ రిజిస్ట్రార్ కె.మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా జాయింట్ రిజిస్ట్రార్ (ఎస్ఆర్-1వో) గా పని చేసి ప్రస్తుతం సస్పెన్షన్‍లో ఉన్న కె.మధుసూదన్ రెడ్డిపై ఏసీబీ కేసు నమోదు చేసింది. ఏసీబీ చేపట్టిన సోదాల్లో ఇప్పటి వరకు రూ. 7.83 కోట్ల విలువైన స్థిర, చర ఆస్తులు కలిగి ఉన్నారని, మార్కెట్ విలువ ఇంకా ఎక్కువ కలిగి ఉండే అవకాశం ఉందని ఏసీబీ పేర్కొంది. మధుసుధన్ రెడ్డి మద్యం వ్యాపారంలో ఏఆర్‍కే స్పిరిట్స్ లో రూ. 80 లక్షల పెట్టుబడి పెట్టారని భార్య, పిల్లల పేర్లపై రెండు షెల్ కంపెనీలు ఉన్నాయని ఏసీబీ పేర్కొంది. అలాగే కాప్రా, ఈసీఐఎల్ ప్రాంతాల్లో ట్రిప్లెక్స్ ఇండిపెండెంట్ ఇండ్లు (300 చ.గ), చింతపల గూడ, ఇబ్రహీంపట్నంలో ఖాళీ స్థలం, పరిగి మండలం నాస్కల్ గ్రామంలో 27 ఎకరాల వ్యవసాయ భూమి, ఇబ్రహీంపట్నం మంగళపల్లిలో 1 ఎకరం కమర్షియల్ ల్యాండ్ ఉన్నట్లు తెలిపింది. అలాగే నాస్కల్ లో సుమారు రూ. 1.2 కోట్ల విలువ చేసే స్మిమ్మింగ్ పూల్ తో పాటు ఫార్మ్ హౌస్ ఉందని తెలిపింది. అతడి వద్ద సుమారు రూ.9 లక్షల నగదు, సుమారు 1.2 కిలోల బంగారం, ఇన్నోవా ఫార్చునర్, వోల్వో XC60, వోల్క్ స్వాగన్ టైగన్ GT ప్లస్ వాహనాలు ఉన్నాయని తెలిపింది.






