సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు

by Naga Rani Yarlagadda |

ఏసీబీ అధికారులు మరో సారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆకస్మిక దాడులు చేపట్టారు. లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ ను, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ను అరెస్ట్ చేశారు.

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఏసీబీ దాడులు
X
  • సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్, జాయింట్ సబ్ రిజిస్ట్రార్
  • వనస్థలిపురం, అదిలాబాద్ కార్యాలయాలో ఏసీబీ తనిఖీలు

దిశ, తెలంగాణ బ్యూరో : ఏసీబీ అధికారులు మరో సారి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో ఆకస్మిక దాడులు చేపట్టారు. లంచం తీసుకుంటున్న సబ్ రిజిస్ట్రార్ ను, జాయింట్ సబ్ రిజిస్ట్రార్ ను అరెస్ట్ చేశారు. గత నెలలో ఇదే తరహలో రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయలలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. రంగారెడ్డి వనస్థలిపురం సబ్ రిజిస్ట్రార్ ఎస్ రాజేష్ కుమార్ ను రూ.70వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసేందకు లక్ష రూపాయలు లంచం డిమాండ్ చేసి రూ.70తీసుకునేందుకు అంగికరించినట్లు ఫిర్యాదుదారు ఏసీబీ అధికారులకు ఇచ్చిన సమాచారంతో అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. సబ్ రిజిస్ట్రార్ తో పాటు నాగోల్ కు చెందిన మరో వ్యక్తి కె. రమేష్‌ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి జ్యూషియల్ రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

ఆదిలాబాద్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జాయింట్ సబ్ రిజిస్ట్రార్‌గా చేస్తున్న కె శ్రీనివాస్ రెడ్డిని రూ.5వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబి అధికారులు పట్టుకున్నారు. నివాస గృహాన్ని గిఫ్ట్ డిడ్ రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేసినట్లు ఫిర్యాదు వచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదు దారు నుంచి లంచం తీసుకుంటుండుంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డట్లు వెల్లడించారు. అరెస్ట్ చేసి కరీంనగర్ ఏసీబీ స్పెషల్ జడ్జీ ఏదుట హాజరుపరిచినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ఉన్నట్లు పేర్కొన్నారు.

Next Story