కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ ఇంట్లో ఏసీబీ దాడులు

by Bhanu |

కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)

కాళేశ్వరం మాజీ ఈఎన్‌సీ మురళీధర్ ఇంట్లో ఏసీబీ దాడులు
X

దిశ, శేరిలింగంపల్లి : కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో, మాజీ ఈఎన్‌సీ మురళీధర్ రావు ఇంటిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు ప్రారంభించారు. శేరిలింగంపల్లిలోని గోపన్‌పల్లిలో ఉన్న క్రిస్టన్ విల్లాలో ఆయన నివాసంలో ఏకకాలంలో రెండు బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి.

అధికారులు మురళీధర్ నివాసంలోని పలు డాక్యుమెంట్లు, ఆస్తుల వివరాలను ఖతం చేశారు. ప్రస్తుతం ఆయన రిటైర్డ్ అయినా, కాళేశ్వరం ఈఎన్‌సీగా కొనసాగిన కాలంలో అనేక కీలక పనులకు సంబంధించిన ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు సమాచారం. కళాశాల స్థాయి స్థాపనలతో పాటు ప్రాజెక్ట్ నిధుల వినియోగంపై అనుమానాలు వ్యక్తం కావడంతో, అధికారులు మరింత లోతుగా విచారణ జరుపుతున్నారు. మిగిలిన ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై కూడా ఏసీబీ విచారణ కొనసాగుతోంది.

Next Story