- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి పంజా విసిరిన ACB.. మాజీ ENC మురళీధర్ రావు ఇంట్లో సోదాలు
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణ నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఇవాళ ఏసీబీ అధికారులు ఇవాల ఉదయం నీటి పారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ (ఈఎన్సీ) రిటైర్డ్ మురళీధర్ రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఉదయం 5 గంటల నుంచి హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో ఉన్న ఆయన నివాసంతో పాటు కరీంనగర్, జహీరాబాద్, నిజామాబాద్‌లలో మొత్తం 10 చోట్ల బంధువులు, స్నేహితుల ఇళ్లలో అధికారులు ఏకకాలంలో సోదాలు చేపడున్నారు.
కాగా, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ సమయంలో ఆయన ఇరిగేషన్ శాఖ ఇంజనీర్-ఇన్-చీఫ్‌గా మురళీధర్ రావు విధులు నిర్వర్తించారు. అనంతరం పదవీ విరమణ చేయగా.. ఆయన సేవలను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 13 ఏళ్ల పాటు పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలోనే మేడిగడ్డ కుంగుబాటు, కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లవెత్తిన క్రమంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మురళీధర్ రావును రాజీనామా చేయాలని చెప్పడంతో పదవి నుంచ వైదొలిగారు. అయితే, అన్ని ప్రాంతాల్లో సోదాలు ముగిసిన వెంటనే అధికారులు ప్రెస్‌మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించే అవకాశం ఉంది.






