- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ACB : చెక్‌పోస్టుల్లో ఏసీబీ మెరుపు దాడులు.. భారీగా నగదు సీజ్ ఎంతంటే?
by Ramesh Naini |
తెలంగాణలోని పలు ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. రాష్ట్రవ్యప్తంగా పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలోని పలు (RTA Check Posts) ఆర్టీఏ చెక్‌పోస్టుల్లో ఏసీబీ (ACB) అధికారులు మెరుపు దాడులు చేశారు. రాష్ట్రవ్యప్తంగా పలు చెక్‌పోస్టుల్లో 7 ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహించాయి. లెక్కలు చూపని నగదును ఏసీబీ అధికారుల బృందాలు సీజ్ చేశాయి. (నల్గొండ) విష్ణుపురం చెక్‌పోస్టులో రూ. 86,600, భోరజ్(ఆదిలాబాద్) చెక్‌పోస్టులో రూ. 62,500, (గద్వాల్) అలంపూర్ చెక్‌పోస్టులో రూ. 29,200 సీజ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు.
ఈ చెక్‌పోస్టుల్లో అవినీతికి పాల్పడుతున్న అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ అధికారులు ప్రకటన వడుదల చేశారు. ఎవరైన లంచం అడిగితే టోల్‌ఫ్రీ నంబర్ 1064కు కాల్ చేయాలని, ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ప్రజలకు సూచించారు.
Next Story






