- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేటీఆర్‌కు BIG షాక్.. మరోసారి ACB నోటీసులు
బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు(ACB Notice) జారీ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(KTR)కు ఏసీబీ(ACB) అధికారులు మరోసారి నోటీసులు(ACB Notice) జారీ చేశారు. సోమవారం(16-06-2025) రోజున ఉదయం 10: 00 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. ఫార్ములా-ఈ రేస్ కేసు(Formula-E Race Case)లో ఈ నోటీసులు జారీ చేశారు. కాగా, ఇప్పటికే ఒకసారి ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిలను విడివిడిగా విచారించారు. మరోసారి విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని అప్పుడే చెప్పారు. అయితే మూడు నెలలు గడుస్తున్నా.. ఎలాంటి విచారణ జరగలేదు. ముగ్గురినీ ఒకేసారి విచారిస్తారని ప్రచారం జరిగినా.. ఈ అంశంపై అసలు స్పష్టతే లేకుండాపోయింది. ఈ క్రమంలోనే నెలలు గడుస్తున్నా.. విచారణలో మాత్రం పురోగతి కనిపించడం లేదంటూ ఇటీవల పలు మీడియా పత్రికల్లో వార్తలు ప్రచురితమయ్యాయి. దీంతో ఏసీబీ అధికారులు అప్రమత్తమై కేటీఆర్‌కు మరోసారి నోటీసులు జారీ చేశారు.






