సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లలో ఏసీబీ ఆకస్మిక తనీఖీలు

by Muthe.Rajitha |

అక్రమార్కులపై ఏసీబీ అధికారులు పంజా విసురుతున్నారు.

సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లలో ఏసీబీ ఆకస్మిక తనీఖీలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : అక్రమార్కులపై ఏసీబీ అధికారులు పంజా విసురుతున్నారు. వరుస తనిఖీలతో హడలెత్తిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలపై ఆకస్మిక తనీఖీలు చెపట్టారు. బీబీనగర్, జడ్చర్ల, సదాశివపేట సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్‌లపై గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. గత నెలలో ఇదే తరహలో ఆర్టీఏ కార్యాలయాలపై , చెక్ పోస్ట్ లపై విరుచుకుపడ్డారు. గత మూడు రోజులలో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మాజీ ఈఎన్సీ మురళీధర్ ఆస్తులపై సోదాలు నిర్వహించి వందల కోట్ల ఆస్తులను గుర్తించారు. పంచాయతీ రాజ్ ఈఎన్సీ వీరవల్లి కనకరత్నం ను రెడ్‌ హ్యండెండ్ గా పట్టుకున్నారు. సబ్ రిజిస్ర్టార్ కార్యాలలో లెక్కల్లో చూపని నగదు, అనధికరంగా ఉన్న ప్రైవేటు ఏజెంట్లను, డాక్యుమెంట్ రైటర్లను గుర్తించారు.

మూడు కార్యాలయాలో రూ.97వేలు స్వాధీనం చేసుకున్నారు. బీబీనగర్ సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్లో ఆకస్మిక తనీఖి చెపట్టి లెక్కల్లో చూపని రూ. 61వేలు స్వాధీనం చేసుకున్నారు. ఆఫీస్ ప్రాంగణంలో 12 మంది అనధికార ప్రైవేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. 93 రిజిస్టర్డ్ పత్రాలు ఎస్ఆర్‌వో సిబ్బంది కస్టడీలో గుర్తించారు. పనిచేయని సీపీ కెమెరాలను, ప్రభుత్వ రిజిస్టర్‌లను నిర్వహించలేదని గుర్తించారు. జడ్చర్లలోని సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్లో లెక్కల్లో చూపని రూ. 31వేలు స్వాధీనం చేసుకున్నారు. 11 మంది అనధికార ప్రైవేట్ ఏజెంట్లు,డాక్యుమెంట్ రైటర్లను గుర్తించారు. 20 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు ఎస్ఆర్‌వో సిబ్బంది కస్టడీలో ఉన్నట్లు గుర్తించారు. రికార్డులు సరిగ్గా నిర్వహించడం లేదని ఉన్నతాధికారులకు సమాచారం అందించారు.

సదాశివపేటలోని సబ్ రిజిస్ర్టార్ ఆఫీస్లో చెపట్టిన తనిఖీలో లెక్కల్లో లేని రూ. 5వేలు స్వాధీనం చేసుకున్నారు. 9 మంది అనధికార ప్రైవేట్ ఏజెంట్లు, డాక్యుమెంట్ రైటర్లు ఉన్నట్లు గుర్తించారు. 39 రిజిస్టర్డ్ డాక్యుమెంట్లు సిబ్బంది వద్ద ఉన్నట్లు గుర్తించారు. పనిచేయని సీపీ కెమెరాలను, ప్రభుత్వ రిజిస్టర్‌లను నిర్వహించలేదని గుర్తించారు. చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు.

Next Story