ACB: ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ

by Ramesh Naini |

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో పంచాయతీ కార్యదర్శి ఎం.అనిల్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

ACB: ఇందిరమ్మ ఇల్లు మంజూరు కోసం లంచం డిమాండ్.. ఏసీబీకి చిక్కిన పంచాయతీ సెక్రటరీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మధురానగర్ గ్రామంలో (Panchayat Secretary) పంచాయతీ కార్యదర్శి ఎం.అనిల్ లంచం తీసుకుంటూ (ACB Telangana) ఏసీబీ అధికారులకు చిక్కాడు. లబ్ధిదారుడి ఇందిరమ్మ ఇల్లు ఫైలును ప్రాసెస్ చేయడానికి రూ.10,000 లంచం డిమాండ్ చేసిన అనిల్, బాధితుడి ఫిర్యాదు మేరకు ఏర్పాటు చేసిన ఉచ్చులో ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. లంచం మొత్తాన్ని స్వీకరిస్తుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ మేరకు ఏసీబీ ఎక్స్ అధికారిక ఖాతా వేదకగా శుక్రవారం ఫోటో, వివరాలు పంచుకున్నారు.

ఒకవేళ ఏ ప్రభుత్వ సేవకుడు అయినా లంచం అడిగినట్లయితే ప్రజలు దయచేసి తెలంగాణ అవినీతి నిరోధక శాఖ వారి "టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు డయల్ చేయండి" అంతే కాకుండా వివిధ సామాజిక మాధ్యమాలు అయిన "వాట్సాప్ ( 9440446106) ఫేస్ బుక్ (Telangana ACB), ఎక్స్ (@TelanganaACB), వెబ్ సైట్ ( https://acb.telangana.gov.in ) ద్వారా కూడా తెలంగాణ అనిశాను సంప్రదించవచ్చు." ఫిర్యాదుధారుల / బాధితుల వివరములు గోప్యంగా ఉంచబడుతాయని ట్వీట్‌లో పేర్కొన్నారు.

Next Story