- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏసీబీ పంజా.. తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా దాడులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్లగొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఓ, బోర్డర్ చెక్‌పోస్టులలో దాడులు చేస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏసీబీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేస్తున్నారు. నల్లగొండ, కరీంనగర్, మహబూబాబాద్, సిద్దిపేట, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని ఆర్టీఓ, బోర్డర్ చెక్‌పోస్టులలో దాడులు చేస్తున్నారు. అక్రమ వసూళ్ల నేపథ్యంలో దాడులు చేస్తున్నారు. ఇప్పటికే అనేక మందిని అదుపులోకి తీసుకోగా, పలు చోట్ల భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు. అదుపులోకి తీసుకున్న ఆర్టీఓ ఏజెంట్లు, అధికారులను విచారిస్తున్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు ఫైళ్లను అధికారులు పరిశీలించారు. అదేవిధంగా నల్గొండలో ఏసీబీ తనిఖీల సమాచారం తెలుసుకున్న ఆర్టీవో.. కార్యాలయం నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం. అదే విధంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు కార్యాలయాలు, వరంగల్, ఆదిలాబాద్‌లతో పాటు మరికొన్ని జిల్లాల్లో ఏసీబీ దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ముందస్తు సమాచారంతో రవాణాశాఖ ఏజెంట్లు అధికారులు అప్రమత్తమయ్యారు.






