హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం

by Malleboina Mahesh |   (  Updated:2025-09-21 03:33:22  IST  )

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్‌వీడీ ప్యానెల్ ఘన విజయం సాధించింది.

హెచ్‌సీయూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ ప్యానెల్ ఘన విజయం
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో జరిగిన విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఏబీవీపీ, ఎస్ఎల్‌వీడీ ప్యానెల్ ఘన విజయం సాధించింది. నిన్న జరిగిన ఈ ఎన్నికల్లో ఎన్ఎస్ యూఐ, ఏబీవీపీ, ఎస్ఎఫ్ఐ ప్యానెల్ పోటీ చేశాయి. సెంట్రల్ యూనివర్సిటీ భూముల విషయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తర్వాత జరిగిన ఈ ఎన్నికలు ఎంతో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థి సంఘాలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రచారంలో పాల్గొన్నాయి. హైదరాబాద్ విశ్వవిద్యాలయం (UoH) విద్యార్థి సంఘం ఎన్నికలు 2025-26 పోలింగ్ ఈ నెల 19న ప్రశాంతంగా జరిగింది.

ఈ ఎన్నికల్లో క్యాంపస్‌లోని అర్హత గల 81 శాతం విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వివిధ విభాగాలలోని 29 పోలింగ్ బూత్‌లలో ఓపికగా క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ఎనిమిది మంది, ఉపాధ్యక్ష పదవికి ఐదుగురు, జనరల్ సెక్రటరీ పదవికి ఆరుగురు, జాయింట్ సెక్రటరీ పదవికి ఐదుగురు, సాంస్కృతిక, క్రీడా కార్యదర్శి పదవికి ఒక్కొక్కరు నలుగురు సహా కీలక ఆఫీస్ బేరర్ పదవులకు మొత్తం 169 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఈ ఎన్నికల్లో SFI, ABVP, NSUI, DSU, ASA, SLVD, MSF, AISA, PDSU, BRSV, AIOBCSA, BSF, TSF వంటి శ్రేణి విద్యార్థి సంస్థలు మద్దతు ఇచ్చాయి.

కాగా ఈ ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు శనివారం ప్రారంభం కాగా అర్ధరాత్రి వరకు 40 రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఈ ఓట్ల లెక్కింపులో ఏబీవీపీ, ఎస్ ఎల్ వీడి ప్యానెల్ అన్ని ప్రధాన స్థానాలను క్లీన్ స్వీప్ చేసింది. ఈ ఎన్నికల్లో ఏబీవీపీ నుంచి అధ్యక్షుడిగా శివ, ఉపాధ్యక్షుడిగా దేవేందర్, జనరల్ సెక్రటరీగా శృతి, జాయింట్ సెక్రటరీగా శుక్లా, కల్చరల్ సెక్రటరీగా వేణుస్, స్పోర్ట్స్ సెక్రటరీగా జ్వాలా విజయం సాధించారు. దీంతో జాతీయవాద సంస్థ అయిన ఏబీవీపీ వరుసగా నాలుగో ప్రతిష్ఠాత్మ యూనివర్సిటీలో గెలిచింది. ఇదిలా ఉంటే సెంట్రల్ యూనివర్సిటీలో 7 సంవత్సరాల తర్వాత ఏబీవీపీ ప్యానెల్ భారీ విజయం సాధించింది.

HCUSU ఎన్నికల పూర్తి రిజల్ట్స్..

అధ్యక్షుడు.40

శివ (ABVP) 1501

అనన్య (SFI) 1321

ABVP 180 తేడాతో విజయం

దేవేందర్ (ABVP) 1773

దివాకర్ (SFI) 1170

ABVP 603 తేడాతో విజయం

జనరల్ సెక్రటరీ 40 రౌండ్లు

శృతి (ABVP) - 1667

సాయి ప్రీతం (SFI) - 937

3వ స్థానం 980

ABVP గెలుపు:687

జాయింట్ సెక్రటరీ 40 రౌండ్లు

శుక్లా (ABVP) 1612

నవీన్ (SFI) 1122

ABVP 490 తేడాతో విజయం

సాంస్కృతిక కార్యదర్శి 40 రౌండ్లు

వీనస్ (ABVP) 2099

శరత్ (SFI) 952

3వ ఫ్రంట్

ABVP విజయం: 1147

క్రీడా కార్యదర్శి 40 రౌండ్లు

జ్వాల (ABVP) 1657

అల్తాఫ్ (SFI) 1207

ABVP విజయం: 450

Next Story