ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇష్యూ.. ఫిర్యాదు చేసిన ఏబీవీపీ

by velandi.Saikiran |

ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చదువుతూ, ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్టైఫెండ్ ని మెడికల్ కళాశాలల యాజమాన్యాలు దోచుకోవడాన్ని ఖండిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు.

ప్రైవేటు మెడికల్ కాలేజీలు ఇష్యూ.. ఫిర్యాదు చేసిన ఏబీవీపీ
X

విద్యార్థుల స్టైఫండ్ ను దోచుకుంటున్న ప్రైవేటు మెడికల్ కాలేజీలు

- ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన ఏబీవీపీ

దిశ, తెలంగాణ బ్యూరో : ప్రైవేట్ మెడికల్ కాలేజీలలో చదువుతూ, ఇంటర్న్షిప్ చేస్తున్న విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్టైఫెండ్ ని మెడికల్ కళాశాలల యాజమాన్యాలు దోచుకోవడాన్ని ఖండిస్తున్నట్లు ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచెర్ల రాంబాబు అన్నారు. అలాగే వైద్యుల హక్కులను కాలరాస్తూ టీజీఎంసీలో ఎక్స్ అఫిషియో సభ్యుల పెత్తనాన్ని ప్రోత్సహించే జీవో నంబర్ 229 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏబీవీపీ బృందం గురువారం హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తు, డీఎంఈ నరేంద్ర కుమార్ కు ఫిర్యాదు చేశారు. విద్యార్థులకు అన్యాయం చేస్తున్న కళాశాలపై విజిలెన్స్ ఎంక్వైరీకి ఆదేశించినట్లు, ప్రభుత్వం ఈ విషయమై సీరియస్ గా ఉన్నట్లు అధికారులు తెలిపారని ఏబీవీపీ నాయకులు పేర్కొన్నారు. కళాశాలలు చేస్తున్న దోపిడి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వాటిపై చర్యలు తీసుకునే విధంగా చూస్తామని హామీనిచ్చినట్లు తెలిపారు. అధికారులను కలిసిన బృందంలో సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ సందీప్, నగర కార్యదర్శి పృద్వితేజ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు రాజు, మహేష్ ఉన్నారు.

Next Story