- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాలకవర్గాల అధికార దుర్వినియోగం.. పీఏసీఎస్, డీసీసీబీల రద్దు
ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల పాలకవర్గాలను, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ప్రభుత్వం రద్దు చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రాథమిక వ్యవసాయ సహాకార సంఘాల పాలకవర్గాలను, జిల్లా కేంద్ర సహకార బ్యాంకులను ప్రభుత్వం రద్దు చేసింది. వీరి బాధ్యతలను పర్సన్ఇన్చార్జిలకు అప్పగించింది. డీసీసీబీల బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. పీఏసీఎస్‌లకు పర్సన్ ఇన్‌చార్జిలను నియమించాలని కలెక్టర్‌లకు సూచించారు. ఈ మేరకు వ్యవసాయ, సహకార శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ఉత్తర్వులు జారీ చేశారు. 904 పీఏసీఎస్‌లు, 9 డీసీసీబీ పాలకవర్గాల కాలపరిమితి గత ఆగస్టు 14న ముగిసింది. ప్రభుత్వం వాటి కాలపరిమితిని 6 నెలలు లేదా ఎన్నికలు జరిగే వరకు రెండింట్లో ఏది ముందైతే అది అమలయ్యేలా ఆదేశాలు గతంలో జారీ అయ్యాయి. ఇటీవల కాలంలో పీఏసీఎస్‌లు, డీసీసీబీ పాలకవర్గాల పనితీరుపై తీవ్రస్థాయిలో ఆరోపణలు వచ్చాయి.
అధికార దుర్వినియోగమే..
యూరియా సరఫరాలో కొన్ని పీఏసీఎస్, డీసీసీబీ పాలకవర్గాలు తమ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, సరియైన విధంగా స్పందించకపోవడంతో యూరియా సరఫరాలో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని ప్రభుత్వానికి నివేదిక అందింది. పీఏసీఎస్‌లో అత్యధికులు గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో ఎన్నికైన వారు ఉండటం, ఆ పార్టీకి చెందిన వారు ఉండటంతో ఉద్దేశపూర్వకంగా యూరియా కొరత సమస్యలు తీసుకొచ్చారని, దాని తీవ్రత ఎక్కువ అయ్యిందని, యూరియా దుర్వినియోగం చేశారని ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్వర్గాలు, అధికార పార్టీకి చెందిన కీలక నేతలు సమాచారం అందించినట్లు తెలిసింది. అందుకే గత ప్రభుత్వంలో ఎన్నికైన పాలకవర్గాలను కొనసాగించి కొత్త సమస్యలు తెచ్చుకోవడం కన్నా పర్సన్ఇన్చార్జిలను నియమించడం మేలని ప్రభుత్వం గుర్తించింది. అందుకే పీఏసీఎస్, డీసీసీబీల పాలకవర్గాల గడువు పెంచుతూ గతంలో జారీ చేసిన జీవోను రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
యాసంగి కోసమే..
యాసంగి సీజన్ ప్రారంభం కాబోతుంది. మళ్లీ యూరియా కష్టాలంటూ ఇప్పటికే సోషల్‌మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలైంది. యూరియా కృత్రిమ కొరతను అధిగమించడంలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిసింది. డీసీసీబీలు అన్ని కూడా ఉమ్మడి జిల్లాల వారిగానే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా కేంద్రంలోని కలెక్టర్‌కు పర్సన్‌ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. వరంగల్జిల్లా డీసీసీబీ బాధ్యతలు మాత్రం హన్మకొండ జిల్లా కలెక్టర్‌కు అప్పగించారు. రాష్ట్రంలో 33 జిల్లాలు ఏర్పాటైనా ఉమ్మడి జిల్లాల వారీగానే డీసీసీబీలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వం కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. దీంతో కొన్ని మండలాల్లో ఒక్క పీఏసీఎస్‌లు కూడా లేవు. దీనితో పీఏసీఎస్‌లను, డీసీసీబీలను పునర్వ్యవస్థీకరించాలని నిర్ణయించారు. ప్రతి మండలానికీ కనీసం ఒక పీఏసీఎస్ ఉండేలా ఏర్పాటు చేయాలని, పునర్ వ్యవస్థీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరల ఎన్నికలు నిర్వహించే వరకూ పర్సన్ ఇన్‌చార్జీలు బాధ్యతల్లో కొనసాగనున్నారు.






