మరో TSPSC పేపర్ లీక్..?! అభ్యర్థుల ఆందోళనతో తెరపైకి కొత్త అనుమానం

by Disha Web |
మరో TSPSC పేపర్ లీక్..?! అభ్యర్థుల ఆందోళనతో తెరపైకి కొత్త అనుమానం
X

దిశ, డైనమిక్ బ్యూరో: టీఎస్ పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంలో సరికొత్త అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటికే గ్రూప్-1 ప్రిలిమ్స్ తో పాటు ఏఈఈ, డీఏవో ఎగ్జామ్స్‌ను రద్దు చేస్తున్నట్లు టీఎస్ పీఎస్సీ ప్రకటించగా.. తాజాగా సీపీడీఓ మరియు ఈఓ పరీక్షల పేపర్ లీక్ అయిందని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేయడం హాట్ టాపిక్‌గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో తమ పరీక్షపై కూడా అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. 46 వేల మంది మహిళలకు అన్యాయం జరుగుతోందని అందువల్ల సీపీడీవో మరియు ఈవో పరీక్షలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.Next Story