T Congress: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు

by Prasad Jukanti |

తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు.

T Congress: రాజ్యసభ అభ్యర్థులుగా అభిషేక్‌ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి నామినేషన్ దాఖలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులుగా (Rajya Sabha Nominations) అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi), వేం నరేందర్ రెడ్డి (Vem Narender Reddy) నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డికి నామినేషన్ పత్రాలు అందజేశారు. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు నేతృత్వంలో వీరు నామినేషన్లు దాఖలు చేయగా ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో మరికాసేపట్లో మరో సెట్ నామినేషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. కాగా రాష్ట్రం నుంచి రెండు స్థానాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ కాగా ఒక స్థానానికి సిట్టింగ్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీకే అవకాశం కల్పించగా రెండో స్థానానికి సీఎం రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ బరిలోకి దింపింది. ఆ మేరకు ఇవాళ ఉదయం కాంగ్రెస్ అధిష్టానం తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించింది.

అధిష్టానానికి ధన్యవాదాలు:

నామినేషన్ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన వేం నరేందర్ రెడ్డి.. తనకు రాజ్యసభ అవకాశం కల్పించిన అధిష్టానానికి ధన్యవాదాలు తెలిపారు. పార్టీ ఆశీర్వాదం తనకు రాజ్యసభ అవకాశం దక్కిందన్నారు. అభిషేక్ సింగ్వీ మాట్లాడుతూ తనకు రెండో సారి అవకాశం ఇచ్చిన హైకమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పారు.
Next Story