- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Akunuri Murali: భారతీయులకు చెడ్డపేరొస్తోంది..! ఆకునూరి మురళి ఆసక్తికర ట్వీట్
విద్యా కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: విద్యా కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి (Akunuri Murali) శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు. వీధుల్లో ఉత్సవాలు జరపడం, బాణాసంచా కాల్చడం, లౌడ్‌స్పీకర్లతో శబ్దం చేయడం, సినిమా హాళ్లలో పాలాభిషేకాలు, ఈలలు, డాన్సులు వంటి వ్యవహారాలు (America) అమెరికాలో చేయరాదని, అలాంటి పనులు పిచ్చి చర్యలుగా భావించబడతాయని ఆయన తెలిపారు.
‘ఇలాంటి చెత్త పనులు ఇండియాలో మాత్రం చేయొచ్చా? ప్రపంచం మొత్తం మన మూర్ఖపు చేష్టలు, మూఢనమ్మకాలను గమనిస్తోంది, అసహ్యించుకుంటోంది’ అని మురళి ట్వీట్‌లో పేర్కొన్నారు. అదే సమయంలో, భారత ప్రభుత్వాలు ఇలాంటి వ్యవహారాలను ప్రోత్సహిస్తూ, పిల్లలకు నాణ్యమైన విలువలతో కూడిన విద్య అందించకుండా కుట్రలు చేస్తున్నాయంటూ ఆయన విమర్శించారు. కాగా, అమెరికాలో నివసిస్తున్న భారతీయులు వారి ప్రవర్తనతో భారత్‌కు చెడ్డపేరు తెస్తున్నారని తాజాగా విమర్శలు ఎక్కువైతున్నాయి. మరీ ముఖ్యంగా కొందరు ప్రవాస తెలుగు వారి ప్రవర్తనతో భారతీయులకు చెడ్డపేరు వస్తోందని ఇటీవల డాలస్‌లో ప్రవాసులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ట్వీట్..






