- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కేటీఆర్ vs సీఎం రమేశ్.. ఆది శ్రీనివాస్ కీలక డిమాండ్
బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) డిమాండ్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR)పై ఏపీ ఎంపీ సీఎం రమేశ్(CM Ramesh) చేసిన ఆరోపణలపై సమాధానం చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్(Aadi Srinivas) డిమాండ్ చేశారు. శనివారం ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేష్ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. సీఎం రమేష్ ఇంటికి కేటీఆర్ వెళ్లారా.. లేదా? అనేది తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పాలని అన్నారు. దమ్ముంటే కవిత, CM రమేష్ ప్రశ్నలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లు అధికారంలో ఆంధ్రావాళ్లతో తిరిగింది మీరే కదా? అని అన్నారు. ఇకనైనా కేటీఆర్ పిచ్చి మాటలు మానుకోవాలని ఆది శ్రీనివాస్ హితవు పలికారు.
‘‘ఫ్యూచర్‌సిటీలో నాకు ఏ కాంట్రాక్ట్ రాలేదు. పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడ్డాయి. నిబంధనల ప్రకారం రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చింది. వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఢిల్లీలో నా ఇంటికి వచ్చింది కేటీఆర్ మర్చిపోయారా?. కవిత సహా ఎవరిపైనా విచారణ జరగకుండా చూడాలని అడగలేదా?. విచారణ ఆపేస్తే బీజేపీలో BRSను విలీనం చేస్తామనలేదా?’ అని బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఆరోపించిన విషయం తెలిసిందే.






