- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Aadi Srinivas: టిమ్స్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలది షో.. ఆది శ్రీనివాస్ కౌంటర్
హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికే హరీశ్ రావు హడావుడి మొదలుపెట్టారని ఆది శ్రీనివాస్ ధ్వజమెత్తారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు వచ్చేసరికి హరీశ్ రావుకు (Harish Rao) సమస్యలు గుర్తుకు వస్తున్నాయని ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ (Aadi Srinivas) విమర్శించారు. హైదరాబాద్ నగర ప్రజలను పక్కదారి పట్టించడానికే హరీశ్ రావు హడావుడి మొదలుపెట్టారని ధ్వజమెత్తారు. ఇవాళ కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన హరీశ్ రావు ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హరీశ్ రావు వ్యాఖ్యలపై తాజాగా స్పందించిన ఆది శ్రీనివాస్.. కొత్తపేట టిమ్స్ ఆసుపత్రి వద్ద హరీష్ రావు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు షో చేశారని విమర్శించారు. పదేళ్లు అధికారంలో ఉండి సూపర్ స్పెషాలిటీ ప్రభుత్వ ఆసుపత్రులను ఎందుకు నిర్మించలేదో హరీశ్ రావు సమాధానం చెప్పాలన్నారు. మా ప్రభుత్వం వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఆసుపత్రిల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అన్ని ఆసుపత్రుల నిర్మాణం దాదాపుగా 90 శాతం పూర్తయిందన్నారు. బీఆర్ఎస్ హయాంలో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులను గాలికి వదిలేసి పేద ప్రజలకు ఉచిత వైద్యం అందకుండా చేసిన మీరా మమ్మల్ని విమర్శించేదని మండిపడ్డారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రవేశపెట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం అని గుర్తు చేశారు. హరీశ్ రావు,కేటీఆర్ ఎన్ని కుప్పి గంతులు వేసినా జూబ్లీహిల్స్ ప్రజలు వారిని పట్టించుకోరని ఎద్దేవా చేశారు.






