- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డాక్టర్ జీ. చిన్నారెడ్డితో ఆది ధ్వని ఫౌండేషన్ ప్రతినిధులు, ప్రముఖులు భేటీ
రాష్ట్రంలోని ఆదివాసి జానపద కళా ఖండాలు, ప్రాదేశిక జీవన విధానాలను, కళాత్మక వ్యక్తీకరణాలను ప్రతిబింబించే ఐదువేలకు పైగా కళా ఖండాలను భద్రపరచడం కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆది ధ్వని ఫౌండేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కోరారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని ఆదివాసి జానపద కళా ఖండాలు, ప్రాదేశిక జీవన విధానాలను, కళాత్మక వ్యక్తీకరణాలను ప్రతిబింబించే ఐదువేలకు పైగా కళా ఖండాలను భద్రపరచడం కోసం ఒక మ్యూజియం ఏర్పాటు చేయాలని ఆది ధ్వని ఫౌండేషన్ ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్, సీఎం ప్రజావాణి ఇంచార్జ్ డాక్టర్ జీ. చిన్నారెడ్డిని కోరారు. ఈ మేరకు మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్‌లో ఆయనతో సమావేశమై వినతి పత్రాన్ని అందజేశారు. ఆది ధ్వని ఫౌండేషన్ కమిటీ సభ్యులు డాక్టర్ చిన్నారెడ్డితో మాట్లాడుతూ, తెలంగాణలో ఉన్న 18 ఆదివాసి తెగలు, బడుగు వర్గాలు, వారి ఉప కులాలు తయారు చేసిన సంగీత వాద్యాలు, లోహ కళాకృతులు, సాహిత్య సాంస్కృతిక రంగాలకు చెందిన విలువైన వస్తువులను మ్యూజియంలో భద్రపరచడానికి గత రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
సేకరించిన ఈ అపురూప వస్తువులకు నీడ లేకపోవడంతో పాడైపోయే ప్రమాదం ఉందని, ఆదివాసీల సాంస్కృతిక చిహ్నాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. భావితరాలకు ఈ కళాఖండాలు, చిహ్నాలను అందించాలంటే మ్యూజియం ఏర్పాటు అత్యంత అవశ్యకమని పేర్కొన్నారు. ఇందుకోసం హైదరాబాద్‌లోని మాదాపూర్, కావూరి హిల్స్ ప్రాంతంలో ఉన్న ఎంపీసీసీ (జీ+1) భవనాన్ని కేటాయించాలని, అందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తామని చిన్నారెడ్డిని కోరారు. వారి వినతిపై స్పందించిన డాక్టర్ చిన్నారెడ్డి, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మ్యూజియం ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆది ధ్వని ఫౌండేషన్ సభ్యులు ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు, ప్రముఖ పత్రికా సంపాదకులు కే. రామచంద్రామూర్తి, కే. శ్రీనివాస్, ప్రొఫెసర్ కోదండరాం, ప్రొఫెసర్ మనోజ, ప్రొఫెసర్ గంటా జలంధర్ రెడ్డి, ప్రముఖ శిల్పి ఎం.వి.రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.






