Minister Ponguleti Srinivas Reddy : మనుషులకు ఆధార్.. భూములకు భూధార్ : మంత్రి పొంగులేటి

by Muthe.Rajitha |

తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) నేడు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో జరిగిన భూభారతి(Bhubharati) సదస్సులో పాల్గొని ప్రసంగించారు.

Minister Ponguleti Srinivas Reddy : మనుషులకు ఆధార్.. భూములకు భూధార్ : మంత్రి పొంగులేటి
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) నేడు ఖమ్మం జిల్లా ఎర్రపాలెంలో జరిగిన భూభారతి(Bhubharati) సదస్సులో పాల్గొని ప్రసంగించారు. రైతుల భూ సమస్యలను గ్రామాల్లోనే పరిష్కరించేందుకు భూభారతి చట్టం-2025(Bhubharati Act 2025)ను అమలు చేస్తున్నామని అన్నారు. మనుషులకు ఆధార్(Adhar) నంబర్ లాగా భూములకు భూధార్(Bhudhar) నంబర్ అనే ఏకైక గుర్తింపు సంఖ్యను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ భూధార్ నంబర్ ద్వారా భూమి యజమాని, సర్వే నంబర్, విస్తీర్ణం, స్వభావం వంటి వివరాలను సులభంగా, పారదర్శకంగా తెలుసుకోవచ్చని తెలిపారు.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో భూ రికార్డులను తారుమారు చేసి, రైతులకు ఇబ్బందులు కలిగించారని ఆయన ఆరోపించారు. ఈ సమస్యలను అధిగమించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి కార్యక్రమం ద్వారా రెవెన్యూ సదస్సులను జూన్ 3 నుంచి 20 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తోందని, ఇందులో సాదాబైనామా, మ్యూటేషన్, సర్వే నంబర్ తప్పులు, వారసత్వ సమస్యలు, నిషేధిత భూముల సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.

ఖమ్మం జిల్లాలో బోనకల్లు, నేలకొండపల్లి వంటి మండలాల్లో ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించగా, జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం విస్తరించారు. ఎర్రపాలెం సదస్సులో పాల్గొన్న మంత్రి పొంగులేటి.. భూధార్ వ్యవస్థ రైతులకు భూ రికార్డులను డిజిటలైజ్ చేసి, సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఇది రెవెన్యూ వ్యవస్థలో సంస్కరణలకు నాందిగా నిలుస్తుందని పేర్కొన్నారు.

ఈ సదస్సుల్లో రైతులు తమ భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను సమర్పించవచ్చని, అధికారులు ఫీల్డ్ ఎంక్వైరీ ద్వారా వీటిని పరిష్కరిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమం రైతులకు న్యాయం చేయడంతో పాటు, భూ రికార్డులలో పారదర్శకతను తీసుకొస్తుందని మంత్రి హామీ ఇచ్చారు.

Next Story