గల్ఫ్‌కు వెళ్తావా పంపిస్తాం! అమ్మాయితో ఏకంగా ఎమ్మెల్యేకు ఫోన్! చివరికి ట్విస్ట్ ఏంటంటే?

by Ramesh Naini |   (  Updated:2025-05-05 09:24:32  IST  )

గల్ఫ్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గల్ఫ్‌లో ఉద్యోగాల పేరిట కొన్ని ఏజెన్సీలు అమాయకులను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే.

గల్ఫ్‌కు వెళ్తావా పంపిస్తాం! అమ్మాయితో ఏకంగా ఎమ్మెల్యేకు ఫోన్! చివరికి ట్విస్ట్ ఏంటంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: గల్ఫ్ మోసాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గల్ఫ్‌లో (Gulf jobs) ఉద్యోగాల పేరిట కొన్ని ఏజెన్సీలు అమాయకులను టార్గెట్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఓ ట్రావెల్ ఏజెన్సీ వ్యవహారం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యేకు ట్రావెల్ ఏజెన్సీ నుంచి ఓ యువతి ఫోన్ చేసి గల్ఫ్‌కు వెళ్తావా పంపిస్తాం.. అంటూ బేరాలు ఆడినట్లు తెలిసింది. దీంతో విస్తుపోయిన ఎమ్మెల్యే.. నేను ఎమ్మెల్యేను అని చెప్పినా యువతి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలోనే ఫోన్ కాల్ పై ఆరా తీయాలని పోలీసులకు ఎమ్మెల్యే సూచించినట్లు తెలిసింది.

ఫోన్ కాల్‌తో తీగ లాగితే అక్రమ దందా బయటికి వచ్చింది. గల్ఫ్ ఉద్యోగాల పేరుతో జగిత్యాల జిల్లాలో మోసాలు జరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసుల విచారణలో ఏజెన్సీ దందా బయటపడింది. గల్ఫ్ ట్రావెల్స్ పేరుతో జగిత్యాల కేంద్రంగా ఓ వ్యక్తి ట్రావెల్స్ ఏజెన్సీ నిర్వహిస్తున్నారు. ఓ మహిళ ఉద్యోగి ద్వారా చుట్టుపక్కల ప్రాంతాల యువతకు ఫోన్లు చేయించి గల్ఫ్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ట్రాప్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ క్రమంలో సదరు యువతి ఎమ్మెల్యేకు ఫోన్ చేసి గల్ఫ్ పంపిస్తానని బేరం ఆడే ప్రయత్నం చేసింది. తనకెందుకు ఫోన్ చేశావని ఎమ్మెల్యే ప్రశ్నించగా ఆ యువతి ఎమ్మెల్యే పైనే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ మేరకు ఎస్పీకి సమాచారం అందించిన ఎమ్మెల్యే ఆదివారం రాత్రి ట్రావెల్ ఏజెన్సీ పై దాడులు నిర్వహించినట్లు సమాచారం. ట్రావెల్ ఏజెన్సీకి అనుమతి లేదని పోలీసులు గుర్తించి.. ట్రావెల్స్ నిర్వహిస్తున్న నవీన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తాజాగా సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

Next Story