ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక ట్రాకింగ్ ఐడీ.. ప్రజావాణిలో వెల్లువెత్తిన సమస్యలు

by Ramesh Naini |

కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 161 ఫిర్యాదులు వచ్చాయి.

ప్రతి ఫిర్యాదుకు ప్రత్యేక ట్రాకింగ్ ఐడీ.. ప్రజావాణిలో వెల్లువెత్తిన సమస్యలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలోని మూడు కార్పొరేషన్లలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 161 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 68 ఫిర్యాదులు, సీఎంసీ పరిధిలో 60, ఎంఎంసీ పరిధిలో 33 ఫిర్యాదులు వచ్చాయని అధికారులు తెలిపారు. టౌన్ ప్లానింగ్, ఇంజినీరింగ్ విభాగాలకు చెందిన ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయి.

స్వీకరించిన ప్రతి ఫిర్యాదుకు ‘ప్రత్యేక ట్రాకింగ్ ఐడీ’ కేటాయిస్తున్నామని సీఎంసీ అధికారులు చెబుతున్నారు. ‘‘ప్రతి ఫిర్యాదును సమగ్రంగా పరిశీలించాలి. క్షేత్రస్థాయి సిబ్బందితో సమన్వయం చేసుకోవాలి. పౌరుల సమస్యలను ప్రాధాన్యతగా తీసుకోవాలి. చేపట్టిన చర్యలపై క్రమం తప్పకుండా పురోగతి వివరాలు అందించాలి. పూర్తిస్థాయి పరిష్కారం జరిగే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలి’’ అని సంబంధిత అధికారులకు సీఎంసీ కమిషనర్ సృజన ఆదేశాలు జారీచేశారు.

Next Story