శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 20 బెదిరింపు కాల్స్

by Malleboina Mahesh |

పేద, మధ్య తరగతి వారు ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కంటుంటారు. అలాంటి వారి కోరిక తీర్చడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి.

శంషాబాద్ విమానాశ్రయానికి మొత్తం 20 బెదిరింపు కాల్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: పేద, మధ్య తరగతి వారు ఒక్కసారైనా విమానంలో ప్రయాణించాలని కలలు కంటుంటారు. అలాంటి వారి కోరిక తీర్చడానికి కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. కానీ కొందరు ఆకతాయిలు చేస్తున్న పనికి విమాన ప్రయాణం అంటేనే హడలెత్తే పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు అభద్రత భావానికి గురవుతున్నారు. రక్షణ, భద్రతా సిబ్బందితో పాటు, ప్రయాణి లు, వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. విమానాశ్రయాలు, విమానాలలో బాంబులు పెట్టాం అంటూ మెయిల్స్, ఫేక్ కాల్స్ కలవరపాటుకు గురి చేస్తున్నాయి. పోలీసులు, నిఘా సంస్థలు చేపట్టిన దర్యాప్తులో మెయిల్స్, ఫేక్‌కాల్స్ ఆకతాయిల పనిగా గుర్తించారు.

ఒకే రోజు రెండు సార్లు బెదిరింపు

హైదరాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి మంగళవారం రెండు సార్లు బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి. దీంతో ఎయిర్‌‌పోర్టు సిబ్బంది వెం టనే అప్రమత్తమై తనిఖీలు చేపట్టింది. తమ కు ఒక మిలియన్ ఇవ్వాలని గుర్తుతెలియని వ్యక్తులు డిమాండ్ చేస్తూ మెయిల్ చేశా రు. డబ్బులు ఇవ్వకపోతే ఎయిర్‌పోర్టులోని ప్రయాణికులపై కాల్పులు జరపడమే కా కుండా బాంబు వేస్తానని హెచ్చరించారు. అంతేకాకుండా అమెరికా వెళ్లే విమానాన్ని హైజాక్ చేసి బెంగళూరులో కూల్చేస్తామని మెయిల్ వచ్చింది. బెదిరింపు వ చ్చిన మెయిల్, ఫోన్ నెంబర్ వివరాలను ఎయిర్‌పోర్టు అధికారులు వెల్లడించారు. మెయిల్ [email protected], Phone: +1-2016143989గా గుర్తించారు. జాస్పర్ పకార్ట్ అనే (అమెరికా, న్యూయార్క్) వ్యక్తి బాంబు బెదిరింపు మెయిల్ చేసినట్టు గుర్తించారు.

రెండేళ్ల శిక్ష సరిపోదు..

భారతీయ న్యాయ సంహిత ప్రకారం బాంబు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో నిందితులకు గరిష్ఠంగా రెండేళ్ల శిక్ష విధించనున్నారు. చట్టాన్ని కఠినతరం చేసి శిక్ష కాలాన్ని పెంచాలని, బాంబు బెదిరింపులు అరికట్టాలని కోరుతున్నారు.

20 సార్లు బెదిరింపు కాల్స్, మెయిల్స్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌‌కు ఇటీవల కాలంలో 20 సార్లు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మెయిల్స్ రూపంలో, ఫేక్‌కాల్స్ రూపంలో బెదిరించారు. నిఘా సంస్థల ద్వారా, సైబర్ క్రైమ్ పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడిన 5 గురిని గుర్తించి అరెస్ట్ చేశారు. 2024 అక్టోబర్‌లో దేశవ్యాప్తంగా విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ ఆర్‌జీఐ ఎయిర్ పోర్టుకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. మూడు విమానాల్లో తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్ నుంచి చండీగఢ్ వెళుతున్న ఇండిగో విమానంలో బాంబు పెట్టామని గుర్తు తెలియని వ్యక్తులు విమానయాన సిబ్బందికి ఫోన్ చేసి బెదిరించారు. అప్రమత్తమైన సీఐఎస్ఎఫ్ భద్రత సిబ్బంది విమానంలో తనిఖీలు చేపట్టారు.

Next Story