- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైడ్రా చెరువుల పునరుద్ధరణను పరిశీలించిన కర్ణాటక ఇంజనీర్ల బృందం
హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణను కర్ణాటక ఇంజనీర్ల బృందం పర్యేవేక్షించింది. అన్ని రాష్ట్రాలకు హైడ్రా అవసరం అని ఇంజనీర్ల బృందం ప్రశంసించింది.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లో హైడ్రా చేపట్టిన చెరువుల పునరుద్ధరణను కర్ణాటక ఇంజనీర్ల బృందం పర్యేవేక్షించింది. అన్ని రాష్ట్రాలకు హైడ్రా అవసరం అని ఇంజనీర్ల బృందం ప్రశంసించింది. హైడ్రా గురించి విన్నామని, పత్రికల్లో చదివామని ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నామని చెప్పింది. పూర్తిగా కనుమరుగైన, కాలుష్యం బారిన పడ్డ చెరువులను అభివృద్ధి చేస్తున్న తీరు చాలా బాగుందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు.
చెరువులు, పార్కులు, నాలాలు మరియు ప్రభుత్వ భూములను పరిరక్షించడం కత్తి మీద సాములాంటిదని అన్నారు. చెరువులు, నాలాలు కబ్జాకు గురవ్వడం వల్లనే వరదలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైడ్రా లాంటి వ్యవస్థను ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపేలా కర్ణాటక ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ఇదిలా ఉంటే తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా హైడ్రాను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. మొదట కేవలం చెరువుల పరిరక్షణ కోసమే హైడ్రా పనిచేయగా ప్రస్తుతం హైడ్రాను విస్తరించారు.






