- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడిని శిక్షించాలి
విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు.

దిశ, నారాయణపేట ప్రతినిధి : విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులను కఠినంగా శిక్షించాలని పీఓడబ్ల్యూ జిల్లా ఉపాధ్యక్షురాలు లక్ష్మీ అన్నారు. నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూరు మండలంలోని మోమినాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదోతరగతి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా అవమానకరంగా, అమానుషంగా ప్రవర్తించిన పాఠశాల ఉపాధ్యాయులైన స్వామి, ఆ స్కూల్లో చదువుతున్న మరో మైనర్ విద్యార్థికి వీడియోను పంపించిన గురునాథ్ రెడ్డి టీచర్ ను కూడా సస్పెండ్ చేసి చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానోపాధ్యాయులకు, ఉపాధ్యాయులకు తెలియకుండా కంప్యూటర్ రూమ్లో సీసీ కెమెరా బిగించి విద్యార్థిని వ్యక్తిగత గోప్యతకు గౌరవానికి భంగం కలిగించేలా కనీసం విద్యార్థిని ముఖాన్ని బ్లర్ చేయకుండా సోషల్ మీడియాలో వైరల్ చేసిన సంబంధిత పాఠశాల ఉపాధ్యాయుడు గుర్నాథ్ రెడ్డి, విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించిన స్వామిని శాశ్వతంగా విధులు నుండి తొలగించాలని డిమాండ్ చేశారు.
పుట్టినప్పటి నుంచి ఎన్నో సామాజిక అవరోధాలను వివక్షతను ఎదుర్కొని ఇప్పుడిప్పుడే బాలికలు చదువుకుంటుంటే మిగతా తల్లిదండ్రుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా పాఠశాలలో పని ప్రదేశాలలో బాలికలు మహిళలు ముఖ్యంగా దళితుల పట్ల నిరంతరంగా దాడులు కొనసాగుతున్నాయని అందుకు ఉదాహరణగా కృష్ణా మండలంలో మాజీ ఎంపీపీ పై అగ్రవర్ణాల దాడి అమ్మిరెడ్డిపల్లిలో దళిత సర్పంచ్ రాములోరి కళ్యాణానికి అనుమతించకపోవడం నిదర్శనంగా ఉన్నాయన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా చట్టబద్ధ జీవనాన్ని కొనసాగించాల్సిన విద్యావంతులు ఇలాంటి దుర్ఘటనలకు పాల్పడడం విచారకరమైనదని, నిందితుల పట్ల తక్షణ చర్యలు తీసుకోకపోతే ఉద్యమాలను లేవనెత్తుతామని హెచ్చరించారు.






