ఇండియా కూటమిలో చీలిక మొదలైంది.. తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు

by Kema Shiva Kumar |

TMC, DMK వంటి పార్టీలు సైతం ఇండియా కూటమి నాయకత్వంపై నమ్మకం కోల్పోయాయని, రాబోయే రోజుల్లో బెంగాల్, తమిళనాడులో ఎన్డీయే (NDA) ప్రభుత్వాలే ఏర్పడతాయని తెలంగాణ బీజేపీ చీఫ్ రామచందర్ రావు అన్నారు.

ఇండియా  కూటమిలో చీలిక మొదలైంది.. తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియా (INDIA) కూటమిలో నాయకత్వ మార్పుపై ‘సామ్నా’ పత్రికలో వచ్చిన కథనం ఆ కూటమి విచ్ఛిన్నమవుతుందని అనడానికి నిదర్శనమని తెలంగాణ బీజేపీ నేత రామచంద్రరావు అన్నారు. ఇవాళ ఉదయం ఆయన జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే (DMK) వంటి చిన్న పార్టీలు సైతం కూటమి నాయకత్వ మార్పును కోరుతుండటం చూస్తుంటే, ప్రస్తుత నాయకత్వంపై భాగస్వామ్య పక్షాలకు నమ్మకం పోయిందని విషయం క్లియర్‌గా అర్థం అవుతోందని రామచందర్ రావు కామెంట్ చేశారు.

కూటమిలో అంతర్భాగంగా ఉన్న పార్టీకి చెందిన ‘సామ్నా’ పత్రికే ఇండియా కూటమి గురించి ఇలాంటి కథనాన్ని ప్రచురించడం అందులోని అంతర్గత విభేదాలను బయటపెట్టిందని రామచందర్ రావు అన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో ‘వికసిత్ భారత్’ నినాదంతో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తోందని అన్నారు. దేశ ప్రజలు ఇండియా కూటమిని తిరస్కరిస్తున్నారని, రాబోయే రోజుల్లో పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్డీయే (NDA) ప్రభుత్వం ఏర్పడుతుందని ఆయన రామచందర్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Next Story