- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bandi Sanjay : పేదలకు ఒక రూల్.. అక్బరుద్దీన్ కు ఒక రూలా? బండి సంజయ్
హైడ్రా(HYDRAA)పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay).

దిశ, వెబ్ డెస్క్ : హైడ్రా(HYDRAA)పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay). సల్కం చెరువులో నిర్మించిన అక్బరుద్దీన్ ఒవైసీ(Akbharuddhin Owaisi) కళాశాలను కూల్చబోమని హైడ్రా కమిషనర్ రంగనాథ్(Ranganath) ట్వీట్ చేయడం వింతగా ఉందన్నారు. పేదల ఇళ్లను వెనుకా ముందు చూడకుండా కూల్చివేసే హైడ్రాకు అక్బరుద్దీన్ కాలేజీని కూల్చడానికి మాత్రం వెనుకడుగు వేస్తోందని విమర్శించారు. ఇది హైడ్రా నిర్ణయమో ప్రభుత్వ నిర్ణయమో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అధికారి రాజకీయ పార్టీకి అనుగుణంగా పనిచేయడం దారుణం అన్నారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా వేరే కాలేజీల్లోకి షిఫ్ట్ చేసి, ఆ కాలేజీని కూల్చాలని డిమాండ్ చేశారు.
ఒక పత్రిక ఏదో రాసిందని వారి మీద దాడి చేస్తామని బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులు బెదిరించడం ప్రభుత్వం ఇచ్చిన అలుసేనని, ముందు నుంచి బీఆర్ఎస్ నేతల మీద కఠిన చర్యలు తీసుకొని ఉంటే, ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని మండిపడ్డారు. ఒకప్పుడు ఫైనాన్స్ డబ్బులు కూడా కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం, ఇపుడు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారని బండి సంజయ్ ప్రశ్నించారు.






