- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలుగోడికి అరుదైన గౌరవం.. మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో-చైర్మన్‌గా సన్నీరెడ్డి
మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మిచిగన్ రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్‌గా తెలంగాణ ప్రాంతానికి చెందిన సన్నీరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. ఈ మేరకు ఆయన ఎన్నికను ప్రవాస భారతీయులు స్వాగతించారు. తాజా పరిణామంతో సన్నీరెడ్డి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టీమ్‌లో ఒకరిగా నిలిచారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా షాద్‌నగర్‌కు చెందిన సన్నీరెడ్డి, నాయకత్వ పటిమ, నిజాయితీ, ప్రజాసేవను గుర్తించిన రిపబ్లికన్ పార్టీ కో చైర్మన్‌గా ఎన్నకుంది. అమెరికాలోని 50 రాష్ట్రాల నుంచి ఒక్కొక్కరిని కో చైర్మన్‌గా ఎన్నుకుంటారు. వారంతా అధ్యక్షుడికి ఆయా రాష్ట్రం నుంచి తగిన సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. అగ్రరాజ్యంలో పార్టీ కో చైర్మన్‌గా నిలిచిన ఏకైక తెలుగు వ్యక్తిగా సన్నిరెడ్డి కావడం విశేషం.
ఎన్ఆర్ఐ సన్నీరెడ్డి వెయిన్ స్టేట్ యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్‌గా కూడా ఎన్నికయ్యారు. ఈ మధ్యే ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో తలలు పండిన అందరినీ వెనక్కి తోసి రిపబ్లికన్ పార్టీ తరపున మంచి మెజారిటీతో సన్నీరెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించారు. 1994లో ఆయన వెయిన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి కెమికల్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందిన ఆయన చివరకు అదే వర్శిటీలో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ మెంబర్ ఎన్నికైన మొదటి వ్యక్తిగా నిలిచారు. అనేక సంవత్సరాలుగా మిచిగన్ రాష్ట్రంలోని విద్య, ఆర్థిక, సామాజిక రంగాల అభివృద్ధికి తీసుకున్న నిర్ణయాలు తనను ఈ స్థాయికి తీసుకువచ్చాయని సన్నీరెడ్డి అన్నారు. కాలేజ్ ట్యూషన్ కాస్ట్స్ తగ్గించి విద్యను అందరికీ అందుబాటులోకి తేవడం, విద్యను రాజకీయాలకు అతీతంగా ఉంచడం, ఆలుమినితో కెరీర్ గైడెన్స్ సేవలను విద్యార్థులకు అందించేలా చేయడం వంటి విషయాలను వివరించి మిచిగన్ ఓటర్లను ఆయన ఆకట్టుకున్నారు. సన్నీరెడ్డికి అమెరికా తెలుగు సంఘంతో మంచి సంబంధాలున్నాయి. ప్రస్తుతం బోర్డ్ ఆఫ్ ట్రస్టీగా ఆటాకి సేవలందిస్తున్నారు. 2017లో హూస్టన్, 2021లో కెంటకీ, 2024లో ఫ్లోరిడా హరికేన్ల సమయంలో అమెరికన్ రెడ్ క్రాస్ సొసైటీతో పని చేయడమే కాకుండా కావాల్సిన ఫండ్స్ రైజ్ చేశారు. ఆయనకు ట్రంప్ బృందంలో చోటు లభించడం అమెరికాలోని తెలుగువారికే కాకుండా ఇండియన్ కమ్యూనిటీ సైతం గర్వించదగిన విషయమని పలువురు ఎన్నారైలు అభిప్రాయపడ్డారు.






