- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అడకత్తెరలో గులాబీ పార్టీ..! వరుస ఎంక్వైరీలతో ఉక్కిరిబిక్కిరి
రానున్న రోజుల్లో వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉక్కిరిబిక్కిరి కానున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: రానున్న రోజుల్లో వరుస విచారణలతో బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఉక్కిరిబిక్కిరి కానున్నారు. ఇప్పటికే ఫార్ములా ఈ కార్ రేసు కేసులో మాజీమంత్రి కేటీఆర్‌ను ప్రాసిక్యూట్ చేసేందుకు ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి కోరారు. రాజ్‌భవన్ నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిన వెంటనే ఆయనపై చార్జిషీట్ వేసి, నిందితులను అరెస్ట్ చేసే చాన్స్ ఉంది. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసుతో పాటు గొర్ల స్కాం కేసు కూడా స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నది. ఆ కేసులను విచారిస్తున్న పోలీసులు ఈ మేరకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తున్నది. అదే టైంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అక్రమాలను నిగ్గుతేల్చేందుకు సీబీఐ సైతం విచారణ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.
చక్రబంధంలో గులాబీ నేతలు
ఫార్ములా ఈ కార్ రేసు, ఫోన్ ట్యాపింగ్, గొర్ల పంపిణీ కేసుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల కేసుల్లో బీఆర్ఎస్ నేతలు చక్రబంధంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ఈ నాలుగు కేసులను దర్యాప్తు చేస్తున్న అధికారులు.. ఒక్కొక్కరిని వరుసగా విచారణకు పిలిచేందుకు క్యాలెండర్ రెడీ చేసుకుంటున్నట్లు తెలుస్తున్నది. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే నిందితులపై చార్జిషీటు వేసేందుకు పోలీసులు కసరత్తు చేస్తున్నారు. అవసరమైతే అరెస్టులు కూడా చేసే చాన్స్ ఉందని పోలీసు వర్గాల్లో టాక్ ఉన్నది. త్వరలో కాళేశ్వరం కేసును విచారించేందుకు సీబీఐ రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో సీబీఐ పోలీసులకు కావాల్సిన సమాచారాన్ని ఇచ్చేందుకు రెడీగా ఉండాలని సంబంధిత శాఖల అధికారులకు మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
ఫార్ములా కేసులో అరెస్టులు తప్పవా?
ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఈసారి అరెస్టులు చేసే అవకాశం ఉంటుందని ప్రచారం ఉంది. ఇప్పటివరకు మాజీ మంత్రి కేటీఆర్, సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌తో పాటు హెచ్ఎండీఏ అధికారులను ఏసీబీ పోలీసులు విచారించారు. అయితే, రాజ్‌భవన్ నుంచి ప్రాసిక్యూషన్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే కోర్టులో చార్జిషీటు వేసి అరెస్టులు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్నది. ఈ కేసులో క్విడ్ ప్రో కో జరిగిందని, ఆ మేరకు ఆధారాలు లభించిన ఆధారాలను కోర్టుకు సమర్పించి, కోర్టు అనుమతితోనే అరెస్టులు చేసే అవకాశం ఉంటుందని చర్చ జోరుగా సాగుతున్నది.
ఫోన్ ట్యాపింగ్ విచారణకు లీడర్లు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటివరకు కేవలం ఆరోపణలు ఎదుర్కోంటున్న పోలీసు అధికారులను మాత్రమే సిట్ విచారణకు పిలిచింది. కొందరిని అరెస్ట్ కూడా చేసింది. రానున్న రోజుల్లో ఫోన్ ట్యాపింగ్‌కు చేయాలంటూ, మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్లు ఆరోపణలు ఎదుర్కుంటోన్న మాజీ మంత్రులు, గులాబీ లీడర్లు విచారణ ఎదుర్కోనున్నట్లు తెలుస్తున్నది. అందుకోసం ఇప్పటికే పోలీసులు గ్రౌండ్ వర్క్ చేస్తున్నట్లు తెలిసింది.ఈ కేసులో నాటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఓ ముగ్గురు నేతల వాయిస్ రికార్డ్సులు పోలీసులు సంపాదించినట్లు సమాచారం.
కాళేశ్వరంపై సీబీఐ
కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అక్రమాలను వెలికి తీసేందుకు సీబీఐ రాష్ట్రంలో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తున్నది. ఈ కేసును విచారించాలంటూ ప్రభుత్వం రాసిన లెటర్‌ను పరిగణలోకి తీసుకున్న కేంద్ర హోంశాఖ త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఆ వెంటనే సీబీఐ పోలీసులు రాష్ట్రంలో విచారణ ప్రక్రియను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకోనున్నారు. మరోవైపు గొర్ల పంపిణీలో జరిగిన అక్రమాల కేసులో ఇప్పటివరకు కేవలం అధికారులను మాత్రమే విచారణకు పిలిచారు. ఈసారి కొందరు రాజకీయ నేతలను విచారణకు పిలిచేందుకు రంగం సిద్దం చేస్తున్నట్లు తెలుస్తున్నది.






