- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డబ్బులు పెట్టి నిల్చోవాలా? రేవంత్ రెడ్డి గారు? (వీడియో)
రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలో అధికారంలోకి రాగానే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించేందుకు అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ స్కీమ్ అమలులోకి వచ్చిన తర్వాత బస్సుల్లో మహిళల ప్రయాణికుల రద్దీ పెరగడంతో పురుషులకు సీట్లు దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డికి రెక్వెస్ట్ చేస్తూ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 'రేవంత్ రెడ్డి గారు.. తాను హైదరాబాద్ నుంచి వస్తున్నాను. డబ్బులు పెట్టి టికెట్ కొనుగోలు చేసి సీట్లు లేకుండా నిలబడాలంటే తమ వల్లే కావడం లేదని, అందువల్లే మహిళలకు స్పెషల్ బస్సులు వేయండి. లేదా టికెట్ కొని ప్రయాణించే పురుషులకు సీట్లు ఏర్పాటు చేయండి' అంటూ తన ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేశాడు.
Next Story






