ప్రజల భ‌ద్రత‌కు ఒక నోడ‌ల్ ఏజెన్సీ అవ‌స‌రం.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

by Ramesh Goud |

ప్రజల భ‌ద్రత‌కు ఒక నోడ‌ల్ ఏజెన్సీ అవ‌స‌రం.. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజల భ‌ద్రత‌కు ఒక నోడ‌ల్ ఏజెన్సీ అవ‌స‌రమని హైడ్రా క‌మిష‌న‌ర్‌ ఏవీ రంగనాథ్ (Hydra Commissioner AV Ranganath) అన్నారు. 'ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ ఇన్ బిల్డింగ్స్‌' (Electrical Safety in Buildings) అనే అంశంపై శ‌నివారం హైడ్రా కార్యాల‌యం (Hydra Office)లో అవగాహన స‌ద‌స్సు జరిగింది. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగ‌నాథ్‌, హైడ్రా ఫైర్ విభాగం అద‌న‌పు సంచాల‌కులు పాప‌య్య, ఎస్‌పీ సుద‌ర్శన్, డిప్యూటీ క‌లెక్టర్ సుధ‌, ఆర్ఎఫ్‌వో జ‌య‌ప్రకాశ్‌, డీఎఫ్‌వోలు య‌జ్ఞనారాయ‌ణ‌, గౌతం, ఎస్ ఎఫ్‌వోలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగనాథ్ మాట్లాడుతూ.. ప్రజ‌ల భ‌ద్రత‌ (People Safety)కు ప్రథ‌మ ప్రాధాన్యాన్నివ్వాల‌ని సూచించారు.

ప్రమాదాల నివార‌ణ‌కు విద్యుత్‌, ఫైర్, ఇండ‌స్ట్రీ ఇలా ఎవ‌రికి వారు కాకుండా.. ఇందుకు ఉద్దేశించిన వ్యవ‌స్థల‌న్నీ ఒక ప్లాట్‌ఫామ్‌ పైకి వ‌చ్చి ప‌ని చేయాల్సిన‌ అవ‌స‌రం ఉంద‌న్నారు. విద్యుత్ వినియోగంలో ఉన్న లోపాల‌వ‌ల్లే ఎక్కువ అగ్ని ప్రమాదాలు (Fire Accidents) జ‌రుగుతున్నాయని, ఈ ప్రమాదాలను అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల‌తో పాటు.. అంద‌రిలో అవ‌గాహ‌న పెంచాల్సిన అవ‌స‌రం ఉందని తెలిపారు. అలాగే భ‌ద్రత‌కు సంబంధించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారో లేదో ప‌రిశీలించ‌డానికి సంబంధిత విభాగాల‌కు చెందిన నిపుణుల బృందంతో ఒక నోడ‌ల్ ఏజెన్సీ (Nodel Agency)ని రూపొందించాల‌ని హైడ్రా కమిషనర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

విద్యుత్ వైరింగ్‌, ఎర్తింగ్‌, నాణ్యమైన ఎల‌క్ట్రిక్ ప‌రిక‌రాల‌ను వినియోగిస్తున్నారా లేదా? అనేది కూడా త‌నిఖీ చేయాల్సిన‌ అవ‌స‌రం ఉందన్నారు. ప‌రిశ్రమ‌లే కాకుండా అపార్టుమెంట్లు, కార్యాల‌యాలు, నివాసాలలో కూడా భ‌ద్రతా ప్రమాణాలు పాటించేలా ఈ నోడ‌ల్ ఏజెన్సీ చూడాల‌ని వివరించారు. దుర్ఘట‌న జ‌రిగిన త‌ర్వాత పోస్టుమార్టం చేసేలా కాకుండా.. అందుకు ఆస్కారం లేని విధంగా చ‌ర్యలు తీసుకోవాల‌ని, అందుకే ఈ స‌ద‌స్సు పెట్టామ‌ని చెప్పారు. హైడ్రాకు చెందిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సు (Hydra Desaster Responce Force) విభాగం ఈ స‌మ‌న్వయాన్ని తీసుకు రావాల‌ని రంగనాథ్ సూచించారు.

Next Story