డిజిటల్ విద్య దిశగా కొత్త అడుగు.. అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు ప్రారంభం

by Ramesh Naini |

దేశంలో సార్వత్రిక, దూర విద్యా విధానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వేదికగా రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభం కానుంది.

డిజిటల్ విద్య దిశగా కొత్త అడుగు.. అంబేద్కర్ వర్సిటీలో జాతీయ సదస్సు ప్రారంభం
X

దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో సార్వత్రిక, దూర విద్యా విధానాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం (Ambedkar University) వేదికగా రెండు రోజుల జాతీయ సదస్సు బుధవారం ప్రారంభం కానుంది. ఇండియన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అసోసియేషన్ (ఐడియా) 26వ జాతీయ సదస్సును బీఆర్ఏఓయూ, ఇగ్నూ, ఉన్నత విద్యా మండలి, గుజరాత్‌కు చెందిన ఇన్‌ఫ్లిబ్‌నెట్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా దూర విద్యా విధానంలో డిజిటల్ పరివర్తన, విధానపరమైన మార్పులు, అందరికీ విద్యను అందించే క్రమంలో ఎదురవుతున్న సవాళ్లపై ఈ సదస్సులో సమగ్రంగా చర్చించనున్నారు. తొలిరోజు డిజిటల్ టెక్నాలజీ, ఓడీఎల్ భవిష్యత్తు అనే అంశంపై ఉన్నత స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం జరగనుంది.

దేశ విదేశాల నిపుణులు ఇందులో తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. రెండో రోజు ప్రొఫెసర్ జి. రామ్ రెడ్డి స్మారక ఉపన్యాసంలో భాగంగా డిజిటల్ లెర్నింగ్ స్పెషలిస్ట్ ప్రొ. సంజయ్ మిశ్రా ప్రసంగించనున్నారు. ఈ రెండు రోజుల్లో మొత్తం 8 సాంకేతిక సెషన్లు నిర్వహించనుండగా, దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల నుంచి తరలివచ్చిన సుమారు 100 మందికి పైగా పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించనున్నారు. ఈ సమావేశాలకు విద్యారంగ ప్రముఖులు హాజరుకానున్నారు.

Next Story