తెలంగాణ విద్యుత్ రంగంలో నవ శకం.. ‘రైతు డిస్కం’ అధికారిక లోగో విడుదల

by Kema Shiva Kumar |

తెలంగాణ విద్యుత్ రంగంలో సరికొత్త విప్లవం చోటుచేసుకోబోతోంది.

తెలంగాణ విద్యుత్ రంగంలో నవ శకం.. ‘రైతు డిస్కం’ అధికారిక లోగో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి నాణ్యమైన సేవలందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటైన రైతు డిస్కం (TGRPDCL) ప్రారంభానికి ముహూర్తం ఖరారైన విషయం తెలిసిందే. జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నుంచి ఈ నూతన డిస్కం పూర్తిస్థాయి సిబ్బందితో తన అధికారిక సేవలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సంస్థకు సంబంధించి అధికారిక లోగో విడుదలైంది. అందులో సౌర, జల, పవన విద్యుత్‌‌కు సంబంధించి చిహ్నాలు ఉన్నాయి. అదేవిధంగా బ్యాక్‌గ్రౌండ్‌లో పంటసాగు దృశ్యం కనిపిస్తుంది. ఈ రైతు డిస్కం‌కు సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టనున్నారు.

కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న దక్షిణ, ఉత్తర డిస్కంల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్‌ఫార్మర్లను వేరు చేసి ఈ సరికొత్త ప్రత్యేక డిస్కంను ఏర్పాటు చేశారు. గత ఐదేళ్ల విద్యుత్ వినియోగ గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కానికి అత్యధికంగా 42 శాతం వాటాను కేటాయించింది. వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్ల ఖచ్చితమైన వివరాలు, వాటి లొకేషన్లను డిజిటల్ రూపంలో సేకరించేందుకు రైతు డిస్కం ఓ ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీని ఆధారంగా క్షేత్రస్థాయిలో సర్వేను అధికారులు మరింత ముమ్మరం చేశారు.

Next Story