- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Munnuru Kapu: వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం
by Prasad Jukanti |
వీహెచ్ నివాసంలో మున్నూరు కాపు నేతల సమావేశం

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వంలో, నామినేటెడ్ పోస్టుల్లో మున్నూరు కాపు నేతలకు (Munnuru Kapu leaders) ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు మున్నూరు కాపు నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హెచ్ (VH) నివాసంలో ఇవాళ మున్నూరు కాపు నేతలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ లోని కీలక నేతలు హాజరయ్యారు. మంత్రివర్గంలో మున్నూరు కాపులు లేకపోవడం ఇదే తొలిసారని, నామినేటెడ్ పోస్టుల్లోనూ అన్యాయం జరుగుతోందని నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. కులగణనపై (caste census) కృతజ్ఞత సభ పెడదామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు. అయితే మన సంఖ్యను తగ్గించారని మున్నూరుకాపు నేతలు అభిప్రాయపడ్డారు. ఈ నేఫథ్యంలో మున్నూరు కాపుల సభ నిర్వహించాలని నేతలు నిర్ణయించారు.
Next Story






