- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Karriguttalu: కర్రిగుట్టల్లో 20 వేల మంది బలగాలతో భారీ సెర్చ్ ఆపరేషన్!
కర్రిగుట్టల్లో మావోయిస్టుల కోసం భారీ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.

దిశ, డైనమిక్ బ్యుూరో: మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ (Operation Kagaru) కొనసాగుతున్నది. తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రిగుట్టల్లో (Karriguttalu) సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతున్నది. మావోయిస్టులు ఎక్కడైనా నక్కి ఉన్నారా అనే కోణంలో 20 వేల మందికి పైగా సాయుధ బలగాలు (security forces) ఈ గుట్టలను అన్ని వైపులా నుంచి చుట్టుముట్టి భారీగా సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. మావోయిస్టులు వదిలి వెళ్లిన బంకర్ల ఆధారంగా వారి కదలికలకు సంబంధించిన ఆనవాళ్లను పసిగట్టే పనిలో బలగాలు నిమ్నమై ఉన్నాయి. కాగా, ఇప్పటికే కర్రిగుట్టల్లోని దోబికొండ, నీలం సరాయ్ కొండలను స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు అక్కడ తాత్కాలిక బేస్ క్యాంప్, సెల్ టవర్స్ ఏర్పాటు చేయగా ఇప్పుడు శాశ్వత బేస్ క్యాంప్ కోసం రంగం సిద్ధం చేస్తున్నాయి. మరోవైపు మావోయిస్టులు దుర్గం గుట్టలకు మకాం మార్చారని కేంద్ర బలగాలకు సమాచారం రావడంతో ఆ దిశగా కూడా కూంబింగ్ ప్రారంభించాయి.






