- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Chhattisgarh: ఎన్‌కౌంటర్‌లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి
ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్(Encounter)లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందారు.

దిశ, వెబ్‌డెస్క్: ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని గరియాబాద్‌లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్(Encounter)లో నల్లగొండ జిల్లాకు చెందిన మావోయిస్టు మృతి చెందారు. నల్లగొండ(Nalgonda Maoist) జిల్లా చండూరు మండలం పుల్లెంల గ్రామానికి చెందిన పాక హనుమంతు(Paka Hanumanthu) మృతి చెందినట్లు ఛత్తీస్‌గఢ్ పోలీస్ అధికారులు వెల్లడించారు. దీంతో ఆ గ్రామంలో విషాదం నెలకొంది. 45 సంవత్సరాల క్రితం పాక హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్లారు. ఈ 45 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే గడిపారు. నల్లగొండ పట్టణంలోని ఏబీవీపీ(ABVP) నాయకుడు శ్రీనివాస్ హత్యలో పాక హనుమంతు నిందితుడు. ఆ తర్వాత హనుమంతు మావోయిస్టు పార్టీలోకి వెళ్ళాడు.
అప్పటినుంచి మావోయిస్టు పార్టీలో క్రీయాశీలకంగా పనిచేస్తున్నారు. కొన్నేళ్ల క్రితమే హనుమంతు తల్లిదండ్రులు చనిపోయారు. ఆయనకు ఇద్దరు అన్నాదమ్ములు ఉన్నారు. కాగా, ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దులో మంగళవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా బలగాలు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో దాదాపు 20 మంది మావోయిస్టులు మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే భారీస్థాయిలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంకా ఫారెస్ట్‌లో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. అయితే చనిపోయిన మావోయిస్టుల్లో హనుమంతు ఉన్నట్లు ఛత్తీస్‌గఢ్ పోలీసులు నిర్ధారించారు.






