- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మిస్ వరల్డ్-2025 ఫినాలేలో కీలక పరిణామం.. పోటీ నుంచి మిస్ ఇండియా నందిని గుప్తా అవుట్
మిస్ వరల్డ్-2025 (Miss World-2025) గ్రాండ్ ఫినాలే పోటీలు హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (Hitex Exhibition Center)లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: మిస్ వరల్డ్-2025 (Miss World-2025) గ్రాండ్ ఫినాలే పోటీలు హైదరాబాద్ (Hyderabad)లోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ (Hitex Exhibition Center)లో అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఖండాల వారీగా టాప్-5 నుంచి ఇద్దరిని షార్ట్ లిస్ట్ చేస్తుండగా.. మిస్ ఇండియా నందిని గుప్తా ఫినాలే నుంచి అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యారు. దీంతో మిస్ వరల్డ్ టాప్-8లో ఇండియాకు చోటుదక్కకుండా పోయింది. టాప్-8 కంటెస్టెంట్స్‌లో మార్టినిక్, బ్రెజిల్, ఇథియోపియా, నమీబియా, పోలెండ్, ఉక్రెయిన్, ఫిలిప్పీన్స్, థాయిలాండ్ దేశాల భామలు చోటు దక్కించుకున్నారు. ఇక మిస్ వరల్డ్ అండ్ కరేబియన్ టాప్-1లో మార్టినిక్, ఆఫ్రికా ఖండం నుంచి టాప్-1లో ఇథియోపియా, ఏషియా అండ్ ఓషియాన నుంచి టాప్-1లో థాయిలాండ్ దేశాల భామలు నిలిచారు. అయితే, ఫినాలేలో విజేత నిలిచిన వారికి రూ.8.5 కోట్ల నగదు, 1,770 వజ్రాలు పొదిగిన కిరీటంతో పాటు ఏడాది పాటు ఉచితంగా ప్రపంచ యాత్రకు అవకాశం కల్పించనున్నారు.






