- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ ధర్నా ఎఫెక్ట్: తెలంగాణ కాంగ్రెస్ శ్రేణులకు కీలక పిలుపు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నేతృత్వంలో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం(Telangana Congress) పిలుపునిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) నేతృత్వంలో తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేపట్టిన ఉద్యమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం(Telangana Congress) పిలుపునిచ్చింది. ఆగస్టు 5వ ఢిల్లీలో పార్లమెంట్‌లో తెలంగాణలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల అంశాలపై చర్చించేలా పార్లమెంటులో వాయిదా తీర్మానం కోసం పోరాటం చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ భారీ ధర్నా తలపెట్టారు. 7న అసెంబ్లీలో తీర్మానం చేసి పంపిన 42 శాతం బీసీ రిజర్వేషన్లు బిల్లును రాష్ట్రపతి ఆమోదం తెలపాలని కోరుతూ రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాలు సమర్పిస్తారు.
ప్రధానంగా 6వ తేదీన జంతర్ మంతర్ వద్ద చేపట్టే ధర్నా కార్యక్రమంలో తెలంగాణ నుంచి పెద్దఎత్తున తరలివచ్చేందుకు టీపీసీసీ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక రైల్‌ను ఏర్పాటు చేసింది. 4వ తేదీ ఉదయం 9 గంటలకు చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ప్రత్యేక రైల్ ఢిల్లీకి ప్రయాణం అవుతుంది. అందుకోసం ప్రతి జిల్లా డీసీసీల నుంచి 25 మంది పేర్లను లిస్ట్ చేసి టీపీసీసీకి పంపించాలి. రైల్ తిరిగి 7వ తేదీ సాయంత్రం ఢిల్లీ నుంచి తిరుగు ప్రయాణం అవుతుంది. డీసీసీ అధ్యక్షులు పేర్లను సకాలంలో పంపించి సహకరించి ధర్నా పెద్దఎత్తున విజయవంతం చేయాలి. ఢిల్లీకి వచ్చే కాంగ్రెస్ కార్యకర్తలు ఆధార్ కార్డ్‌ను వెంట తెచ్చుకోవాలి. జిల్లా నుంచి వచ్చే 25 మందిని సకాలంలో రైల్వే స్టేషన్‌కు చేర్చాలి. ఢిల్లీకి వచ్చే వారికి అక్కడ వసతి, రవాణా, భోజన సదుపాయాలను పార్టీ ఏర్పాటు చేసిందని పార్టీ అధిష్టానం పేర్కొంది.






