- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: పార్టీ జెండా రంగు రివీల్ చేసిన కవిత!
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి కీలక విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయనున్న పార్టీకి సంబంధించి కీలక విషయాన్ని ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. కవిత ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీ జెండా, ఎజెండాలో నీలిరంగులో ఉండబోతున్నది. ఈ విషయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. తమ దర్శనికతకు, మాట ఇస్తే తుది వరకు కట్టుబడి ఉండే నమ్మకత్వానికి నీలం రంగు చిహ్నం అని పేర్కొన్నారు. కలర్ థియరీ అనే హాష్ ట్యాగ్‌ను తన పోస్ట్‌కు జత చేశారు. ఈనెల 25న మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మునీరాబాద్‌లోని అద్వయ కన్వేషన్ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయబోతున్నామని శ్రీరామ నవమి వేడుకల సందర్భంగా కవిత నిజామాబాద్‌లో ప్రకటించారు.
రాజకీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ, ఏర్పాట్లలో వేగం పెంచారు. వివిధ వర్గాల ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ తన రాజకీయ పార్టీ జెండా, ఎజెండా రూపకల్పనలో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే శనివారం ‘ఎక్స్’ వేదికగా తమ పార్టీ జెండా, ఎజెండాలో నీలి రంగు ఉండబోతున్నట్లు సంకేతాలు ఇచ్చారు. తెలంగాణ జాగృతి సంస్థలోని ఆకుపచ్చ రంగు పచ్చదనానికి, వ్యవసాయానికి, రైతు సంక్షేమానికి నిదర్శనం అయితే.. నీలిరంగు బడుగు బలహీన వర్గాల వికాసం, సమున్నతికి సూచిక అని తెలుస్తోంది. సామాజిక తెలంగాణ-సర్వోదయ వికాసం ఎజెండాగా, తెలంగాణ ఫస్ట్ సిద్ధాంతంగా తమ పార్టీ ఉంటుందని ఇప్పటికే కవిత పలు సందర్భాల్లో వెల్లడించారు. పార్టీ ఏర్పాటు వేదికపై తమ పార్టీ విధివిధానాలు, సిద్ధాంతాలను పూర్తి స్థాయిలో ప్రకటించే అవకాశం ఉందని జాగృతి వర్గాలు వెల్లడిస్తున్నాయి.






