- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెలుగులోకి మరో స్కామ్.. మల్టీ జెట్ స్కీమ్ పేరుతో భారీ మోసం
మల్టీ జెట్ స్కీమ్ పేరుతో జరిగిన భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

X
దిశ, వెబ్‌డెస్క్: మల్టీ జెట్ స్కీమ్ పేరుతో జరిగిన భారీ మోసం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రూ.14 వేలు పెడితే భారీ లాభాలంటూ కేటుగాళ్లు ప్రచారం చేశారు. రూ.14 వేలకు ప్రతిరోజూ డబ్బులు ఇస్తామని చెప్పడంతో నిజమని నమ్మిన ప్రజలు.. వేల సంఖ్యలో పెట్టుబడులు పెట్టారు. మొదట్లో ఎలాంటి అనుమానం రాకుండా కొన్నాళ్లపాటు మల్టీజెట్ స్కీమ్ నిర్వహకులు డబ్బు చెల్లించారు. గత కొంత కాలంగా డబ్బులు చెల్లించకపోవడంతో ఆందోళన చెందిన కస్టమర్లు పోలీసులను ఆశ్రయించారు. మల్టీ జెట్ స్కీమ్ పేరుతో దాదాపుగా రూ.100 కోట్లకు పైగానే కుచ్చుటోపి పెట్టినట్లు తెలుస్తోంది. మల్టీ జెట్ ఎండీ ముత్తిరాజు ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఎండీ ముత్తిరాజు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మల్టీ జెట్ స్కీమ్ బాధితులు సీసీఎస్ దగ్గర ఆందోళనకు దిగారు.
Next Story






