ప్రభుత్వ నిర్ణయంతో భారీగా తగ్గిన ఆదాయం.. కాగ్ ప్రకటన

by Gantepaka Srikanth |

నాన్​ట్యాక్స్ రెవెన్యూలో రాష్ట్రానికి భారీగా ఆదాయం తగ్గింది. ప్రభుత్వం భూములు విక్రయించకపోవడంతో ఆదాయం తగ్గినట్లుగా గుర్తించారు.

ప్రభుత్వ నిర్ణయంతో భారీగా తగ్గిన ఆదాయం.. కాగ్ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: నాన్​ట్యాక్స్ రెవెన్యూలో రాష్ట్రానికి భారీగా ఆదాయం తగ్గింది. ప్రభుత్వం భూములు విక్రయించకపోవడంతో ఆదాయం తగ్గినట్లుగా గుర్తించారు. రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన నాన్స్​టాక్స్​రెవెన్యూకు డిసెంబర్ వరకు వచ్చిన ఆదాయంలో కేవలం 15 శాతం మాత్రమే ఆదాయం వచ్చిందని గుర్తించారు. ప్రతి నెల రాష్ట్ర ఆదాయంపై వివరాలను గురువారం కాగ్​వెల్లడించింది. ఈ నేపథ్యంలో మిగిలిన రంగాల్లో దాదాపుగా అంచనాలకు అనుగుణంగా అటు ఇటుగా ఉన్నా... నాన్ ట్యాక్స్ రెవెన్యూలో మాత్రం భారీ తేడాలు ఉన్నాయి. ప్రభుత్వం 2024–25లో ప్రతిపాదించిన ఆదాయం రూ.2,74,057కోట్లు వస్తుందని అంచనా వేయగా డిసెంబర్​నెలాఖరు నాటికి రూ.1,60,518కోట్ల ఆదాయం వచ్చినట్లుగా కాగ్​వెల్లడించింది. మొత్తం అంచనాలో 58.57 శాతం ఉందని లెక్కించారు. గత సంవత్సరం డిసెంబర్ నాటికి 62.17 శాతం ఆదాయం వచ్చింది.

ప్రభుత్వం 2024–25లో ప్రతిపాదించిన ఆదాయంలో 15 శాతం మాత్రమే నాన్​టాక్స్​రెవెన్యూలో వచ్చింది. దీంతో మొత్తం ఆదాయం ప్రతిపాదించిన బడ్జెట్​లో 58.57 శాతం ఉన్నట్లుగా తేల్చారు. 9 నెలల్లో రెవెన్యూ ఆదాయం 50.76 శాతం ఉన్నట్లుగా తెలిపింది. పన్నుల ద్వారా రూ.1,02,047 కోట్లు ఆదాయం 62.07 శాతం కాగా, నాన్​ టాక్స్​ రెవెన్యూ రూ.5487కోట్లు 15.59శాతం మాత్రమే ఆదాయం వచ్చింది. ఇలా మొత్తం ఆదాయం రూ.1,60,518 కోట్లు వచ్చింది. స్టాంప్స్​అండ్​రిజిస్ట్రేషన్​ద్వారా ఇప్పటి వరకు 7524 +3046 కోట్లు 10570 కోట్ల ఆదాయం వచ్చింది. టాక్స్​ రెవెన్య నెల వారిగా చూస్తే డిసెంబర్​లో గత నెలతో పోల్చినా, గత సంవత్సరం డిసెంబర్​తో పోల్చినా తగ్గింది. కేంద్రం ఇచ్చే గ్రాంట్​ఇన్​ఎయిడ్​లోనూ తగ్గాయి. దీంతో మొత్తంగా రాష్ట్రానికి భారీగా తగ్గింది.

Next Story