- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైక్ లో భారీ నాగుపాము..బుసలు కొడుతూ !
పాము (Snake).. ఆ పేరు వింటేనే వణికిపోతారు జనాలు. అలాంటిది బైక్ చక్రాల్లో దూరితే.. భరించగలమా..? అయితే అచ్చం అలాంటి

దిశ, వెబ్ డెస్క్ : పాము (Snake).. ఆ పేరు వింటేనే వణికిపోతారు జనాలు. అలాంటిది బైక్ చక్రాల్లో దూరితే.. భరించగలమా..? అయితే అచ్చం అలాంటి సంఘటనే బాసరలో జరిగింది. బైక్ డిక్కీలో.. లేదా హెల్మెట్ లో.. బైక్ బ్యాగ్ లో పాములు, ఇతర విషపూరిత కీటకాలు దూరడం మనం చూసే ఉంటాం. అలాంటి సంఘటనలు నిత్యం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి.
బైక్ లో పాము దూరిన సంఘటన మరోటి తాజాగా వెలుగులోకి వచ్చింది. బాసరలో ( Basara) ఓ టూ వీలర్ వాహనదారుడి బైక్ వెనుక టైర్ లోకి.. నాగుపాము దూరింది. అయితే ఆ విషయం తెలియక బైక్ తీసే ప్రయత్నం చేశాడు వాహనదారుడు. ఈ నేపథ్యంలోనే ఆ పాము బుసలు కొట్టింది. దీంతో వెంటనే అలర్ట్ అయ్యాడు వాహనదారుడు.
అనంతరం... పాములు పట్టే వ్యక్తిని పిలిపించాడు. దీంతో... వెనుక టైర్ లో దూరిన నాగుపామును కర్ర సహాయంతో తీశాడు. అనంతరం ఆ పాము.. పడగ కూడా విప్పింది. ఈ నేపథ్యంలోనే ఆ పామును అడవిలోకి వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన జనాలు షాక్ అవుతున్నారు. జస్ట్.. మిస్.. ఆ పామును చూడకపోతే వాహనదారుడు చనిపోయేవాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.






