- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో సీపీఐ (ఎం.ఎల్) నేతల భేటీ
కేసీఆర్ ప్రభుత్వ విధానమే మీరు కొనసాగించడం శోచనీయం అని సీపీఐ (ఎం.ఎల్) నేతలు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజా సమస్యలను పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని సీపీఐ (ఎం.ఎల్) (CPI M.L) మాస్ లైన్ పార్టీ ప్రతినిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని (CM Revanth Reddy) విజ్ఞప్తి చేశారు. ఇవాళ జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో సీపీఐ (ఎం-ఎల్) మాస్ లైన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, కేజీ. రాంచందర్, కట్ట రమ, కే. సూర్యం బృందం రేవంత్ రెడ్డిని కలిశారు. పోడు సాగుదారులకు పట్టాలు ఇవ్వాలని పోడు రైతుల పంటలను ధ్వంసం చేస్తున్న ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలను ఆపాలని కోరారు. ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయడంతో పాటు క్యాజువల్ కార్మికుల బేసిక్ రూ. 18 వేల వేతనం ఇవ్వాలని కోరారు. నారాయణపేట, కొడంగల్ ప్రాజెక్టు భూనిర్వాసితులకు భూమికి బదులు భూమి ఇవ్వాలని నిర్వాసిత ప్యాకేజీని 28 లక్షళు ఇవ్వాలన్నారు. సీతారామ ప్రాజెక్టును ఇల్లందు, మహబూబాబాబాద్, డోర్నకల్ ప్రాంతానికి పొడిగిచాలనే డిమాండ్ తో పాటు 27 అంశాలతో కూడిన వినతి పత్రాన్ని సీఎంకు అందజేశారు. మంత్రులు జిల్లా పర్యటనకు వచ్చినప్పుడు వామపక్ష పార్టీ నాయకులను అప్రజాస్వామికంగా ముందస్తు అరెస్టులు చేస్తున్నారని సీఎం దృష్టికి తీసుకువచ్చారు. కేసీఆర్ పాలనలో కొనసాగిన ఈ విధానాన్ని ఈ ప్రభుత్వం కొనసాగించడం శోచనీయమన్నారు.






