మూసీ పునరుజ్జీవనానికి శుభారంభం.. 39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ శంకుస్థాపన

by Ramesh Naini |   (  Updated:2025-09-21 02:08:35  IST  )

మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న 39 ఎస్టీపీల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు.

మూసీ పునరుజ్జీవనానికి శుభారంభం.. 39 ఎస్టీపీలకు సీఎం రేవంత్ శంకుస్థాపన
X

దిశ, సిటీ బ్యూరో: (Musi River) మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. జలమండలి ఆధ్వర్యంలో చేపట్టనున్న 39 ఎస్టీపీల (STPs) నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నారు. అయితే ఔటర్ రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల నుంచి వచ్చే మురుగునీరు మూసీలో కలవకుండా ఎక్కడికక్కడే శుద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా ఓఆర్ఆర్ పరిధిలో అమృత్ 2.0లో 39 సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్స్(ఎస్టీపీలు)లను ఏర్పాటు చేసే బాధ్యతలను జలమండలికి ప్రభుత్వం అప్పగించింది. వీటిని హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో భాగంగా 40 శాతం ప్రభుత్వ వాటా, 60 శాతం కాంట్రాక్టు ఏజెన్సీ వాటా కింద ఖర్చు చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో..

ఓఆర్ఆర్ పరిధిలో 39 ఎస్టీపీలను నిర్మించడానికి కాంట్రాక్టు ఏజెన్సీలు రూ.1,805.97 కోట్లకు టెండర్లు దక్కించుకున్నాయి. హైబ్రిడ్ యాన్యుటీ మోడ్‌లో భాగంగా 40 శాతం ప్రభుత్వ వాటా రూ.722.38 కోట్లు, 60 శాతం సంబంధిత ఏజెన్సీలు రూ.1,083.58 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వాటాకు సంబంధించి హడ్కో నుంచి రుణం తీసుకోవాలని జలమండలి నిర్ణయించింది. లోన్ మంజూరు అయినట్లు అధికారులు చెబుతున్నారు.

బతుకమ్మకుంట ఎస్టీపీ..

అంబర్‌పేట్‌లోని బతుకమ్మకుంట ఎస్టీపీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. అంబర్‌పేట్‌లో నిర్మిస్తున్న 212.5 ఎమ్మెల్డీ సీవ‌రేజి ట్రీట్‌మెంట్ ప్లాంట్ (ఎస్టీపీ) ప‌నులు పూర్తయ్యాయి. ల్యాండ్ స్కేప్, సివిల్ వర్క్స్ జరుగుతున్నాయని, రెండు రోజుల్లో పూర్తి చేయనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

Next Story