సింగరేణికి "గోల్డెన్" ఛాన్స్

by Muthe.Rajitha |

సింగరేణి సంస్థ(SCCL) మరో "బంగారు" అవకాశాన్ని దక్కించుకుంది.

సింగరేణికి గోల్డెన్ ఛాన్స్
X

దిశ, వెబ్ డెస్క్ : సింగరేణి సంస్థ(SCCL) మరో "బంగారు" అవకాశాన్ని దక్కించుకుంది. బంగారం, రాగి వెలికితీసే మరో కీలక ఖనిజ రంగంలోకి సింగరేణి అడుగు పెట్టబోతోంది. కర్ణాటకలోని దేవ్ దుర్గ్ గనుల్లో బంగారం, రాగి అన్వేషణకు కేంద్రం నుంచి లైసెన్స్ పొందింది. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఆన్లైన్ వేలంలో 37.75 శాతం రాయల్టీని కోట్ చేయడం ద్వారా సింగరేణి ఎల్-1 బిడ్డర్ గా నిలిచిందని ఆ సంస్థ సీఎండీ బలరాం వెల్లడించారు. కాగా తెలంగాణ ప్రభుత్వ కోరిక మేరకు సింగరేణి ఇతర రంగాల్లోకి అడుగు పెట్టాలన్న కోరిక తొలి ప్రయత్నంలోనే నెరవేరినందుకు సంతోషంగా ఉందన్నారు. రానున్న 5 ఏళ్లలో ఈ గనుల్లో బంగారం, రాగి వెలికితీసే పనులు మొదలు పెడతామని బలరాం పేర్కొన్నారు.

కాగా త్వరలోనే సింగరేణి పరోశోధన బృందాలు గనుల్లో పరిశోధన చేసి, నివేదికను కేంద్రానికి సమర్పిస్తాయి. అనంతరం మైనింగ్ కోసం వేలం నిర్వహిస్తుంది. ఆ వేలంలో సింగరేణి సహా ఇతర సంస్థలు పోటీ పడతాయి. బిడ్ ను దక్కించుకున్న సంస్థ గని జీవితకాలం పాటు 37.75 శాతం రాయల్టీని కర్ణాటకకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం సింగరేణి దక్కించుకున్న ఖనిజాల అన్వేషణకు రూ.90 కోట్లు ఖర్చు అవుతుండగా.. అందులో కేంద్రప్రభుత్వం రూ.20 కోట్లు సబ్సిడీ ఇవ్వనుంది.

Next Story