మాజీ ప్రేమికులను కలిపిన గెట్ టూ గెదర్.. భర్తకు విషయం తెలిసి దారుణం!

by Ajay Maddhiboyina |

ఈ మధ్య స్కూల్, కాలేజీ గెట్ టూ గెదర్ ఫంక్షన్‌లు కొంప ముంచుతున్నాయి. గెట్ గెదర్ కు వచ్చే ఓల్డ్ స్టూడెంట్స్ మధ్య పాత ప్రేమలు మళ్లీ చిగురిస్తున్నాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిన కాపురాల్లో చిచ్చు రేగుతోంది.

మాజీ ప్రేమికులను కలిపిన గెట్ టూ గెదర్.. భర్తకు విషయం తెలిసి దారుణం!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ మధ్య స్కూల్, కాలేజీ గెట్ టూ గెదర్ ఫంక్షన్‌లు కొంప ముంచుతున్నాయి. గెట్ గెదర్ కు వచ్చే ఓల్డ్ స్టూడెంట్స్ మధ్య పాత ప్రేమలు మళ్లీ చిగురిస్తున్నాయి. దీంతో అప్పటి వరకు సాఫీగా సాగిన కాపురాల్లో చిచ్చు రేగుతోంది. అప్పట్లో అమీన్ పూర్‌లో ఓ తల్లి ముగ్గురు చిన్నారులకు విషం పెట్టి హతమార్చిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో గెట్ టూ గెదర్ లో కలిసిన మాజీ ప్రియుడితో వెళ్లేందుకే తల్లి ఈ దారుణానికి పాల్పడినట్టు తేలింది. ఇప్పుడు పెద్దపల్లిలోనూ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

స్కూట్ గెట్ టూ గెదర్ లో కలిసిన మాజీ ప్రియుడితో భార్య టచ్ లోకి వెళ్లడం చూసిన భర్త అతడిని లోకంలోనే లేకుండా చేశాడు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన అలేఖ్య, వంశీ స్కూల్ లో ఉన్నప్పుడు ప్రేమించుకున్నారు. ఆ తరవాత అలేఖ్య నవీన్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. ఇటీవల టెన్త్ క్లాస్ గెట్ టూ గెదర్ జరగగా వీరిద్దరి మధ్య పాత ప్రేమ మళ్లీ చిగురించింది. ఇద్దరూ ఒకరితో ఒకరు ఫోన్లు మాట్లాడుకోవడం, కలుసుకోవాలని ప్లాన్స్ వేసుకోవడం అంతా భర్త నవీన్ కు తెలిసిపోయింది.

దీంతో వంశీని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని పథకం రచించిన భర్త ఏప్రిల్ 30న అతడిని ఇంటికి పిలిచి మందు పార్టీ ఇచ్చాడు. ఫుల్లుగా మద్యం తాగిన తరవాత తన స్నేహితుడు భాస్కర్ సహాయంతో కత్తితో పొడిచి హత్య చేశాడు. అనంతరం అతడి ఎవరూ గుర్తు పట్టకుండా మృతదేహాన్ని కవర్‌లో చుట్టి, కారు డిక్కీలో వేసుకుని మంథని సమీపంలోని గాడుదుల గండి లోయలో పడేశారు. మొదట వంశీ కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరిపి సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితులైన నవీన్, భాస్కర్ ను అదుపులోకి తీసుకున్నారు. వీరితో పాటు అలేఖ్యను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Next Story