- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘సార్.. మీ వల్లే నేను డాక్టర్ అయ్యాను’ హరీశ్‌రావుకి కృతజ్ఞతలు తెలిపిన ఓ డాక్టరమ్మ! వీడియో వైరల్
మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నాడు చేసిన సాయం.. నేడు సమాజానికి ఒక డాక్టర్‌ను అందించింది.

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు నాడు చేసిన సాయం.. నేడు సమాజానికి ఒక డాక్టర్‌ను అందించింది. ‘సార్.. మీ వల్లే నేను డాక్టర్ అయ్యాను.. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే మీ వల్లే’ అంటూ నాడు మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన సాయానికి ఓ డాక్టరమ్మ కృతజ్ఞతలు తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వైరల్ వీడియోలో మీ వల్లే డాక్టర్ అయ్యాను సార్ అంటూ యువతి కన్నీళ్లతో చెప్పిన మాటలకు హరీశ్ రావు చలించిపోయారు. కారు దిగి, ఆప్యాయంగా పలకరించి, ఆమె భవిష్యత్తు మరింత గొప్పగా ఉండాలని దీవించారు. అనంతరం వారు హరశ్‌రావుతో ఫోటోలు దిగారు.
కాగా, పదవులు శాశ్వతం కాదు.. మనం చేసే పనులే శాశ్వతం అని నిరూపించారని హరీశ్‌రావు అభిమానులు తెలిపారు. సాయం చేసి మర్చిపోవచ్చు కానీ ఆ సాయాన్ని పొందిన ఈ అమ్మాయి హరీశ్ రావుని గుర్తుపెట్టుకుని మరీ 20 కిలోమీటర్లు కారులో ఛేజ్ చేసి హరశ్‌రావును కలిసి కృతజ్ఞతలు చెప్పడం రాజకీయాలకు అతీతమైన ఒక మానవీయ బంధానికి నిలువెత్తు సాక్ష్యం.. ఇవాళ గెలిచింది కేవలం ఆ వైద్య విద్యార్థిని మాత్రమే కాదు.. నమ్ముకున్న వారికి అండగా నిలిచిన హరీశ్ రావు వ్యక్తిత్వం కూడా గెలిచిందని అభిమానులు చెబుతున్నారు. వీడియో ఇదే..






