- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CPI: మాకు బలమున్న చోట్ల సీట్లివ్వండి.. టీపీసీసీ చీఫ్ తో సీపీఐ నేతల బృందం భేటీ
స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో సీపీఐ నేతల బృందం కాంగ్రెస్ స్టేట్ చీఫ్ తో భేటీ అయ్యారు.

దిశ, తెలంగాణ బ్యూరో/ డైనమిక్ బ్యూరో: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్‍తో (Mahesh Kumar Goud) సీపీఐ (CPI) నాయకుల బృందం భేటీ అయింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఇవాళ మహేశ్ కుమార్ గౌడ్ నివాసంలో సీపీఐ ప్రతినిధి బృందం సమావేశం అయింది. ఈ సమావేశంలో సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‍రెడ్డి, సిీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు తక్కల్లపల్లి శ్రీనివాసరావు, ఈటి.నరసింహ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవేన శంకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ జడ్పీటీసీ స్థానాలలో కాంగ్రెస్‍తో సీట్ల సర్దుబాటుపై చర్చించారు.
పొత్తు కొనసాగేనా?:
గత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఐ కలిసి పోటీ చేశాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతుతో సీపీఐ కొత్తగూడెం నియోజకవర్గంలో పోటీ చేసి విజయం సాధించింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ కాంగ్రెస్, సీపీఐ పొత్తతో ముందుగు సాగబోతున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్థానిక పరిస్థితులను బట్టి సీపీఐ, సీపీఎం, టీజేఎస్ పార్టీల అభ్యర్థులకు సీట్ల కేటాయింపు ఉంటుందని ఇటీవల పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి భేటీలో వామపక్ష నేతలు సీట్ల సర్దుబాటుపై కాంగ్రెస్ ముందు పలు ప్రతిపాదనలు ఉంచినట్లు సమాచారం.
బలమైన చోట్ల సీట్లకోసం పట్టు!:
కాంగ్రెస్‍తో పొత్తు విషయంలో సీపీఐ ఆయా జిల్లాల్లో పరిస్థితులను బట్టి ముందుకు సాగబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆ పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పొత్తులపై సీపీఐ అధిష్టానం సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిసింది. ఖమ్మం, నల్లగొండ, రంగారెడ్డి, మహబూబ్‌నగర్, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లో వామపక్షాలకు కొంత బలం ఉంది. తమకు బలం ఉన్న చోట్ల పోటీ చేయబోతోందని ఆ మేరకు సీట్ల సర్దుబాటుపై ఇవాళ పీసీసీ చీఫ్ తో చర్చించారు.






