- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం భేటీ
by Prasad Jukanti |
పెట్టుబడుల విషయంలో ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందంతో సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో: పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ప్రతినిధి బృందానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) భరోసా ఇచ్చారు. జూబ్లీహిల్స్ క్యాంప్ కార్యాలయంలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో మర్యాదపూర్వక భేటీ అయింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఏడబ్ల్యూఎస్‌కు సంబంధించి ఆన్ గోయింగ్ డేటా సెంటర్స్ ప్రాజెక్టులు, విస్తరణ తదితర అంశాలపై సీఎంతో ప్రతినిధి బృందం చర్చించింది. పెట్టుబడుల విషయంలో ప్రభుత్వం నుంచి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయని వారికి ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏడబ్ల్యూఎస్ డేటా సెంటర్ గ్లోబల్ హెడ్ కెర్రీ పర్సన్, ఇన్ఫ్రా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ విక్రమ్ శ్రీధరన్, అనురాగ్ కిల్నాని, తదితరులు పాల్గొన్నారు.
Next Story






