- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆర్డర్ ఇచ్చి షాక్ తిన్న కస్టమర్.. ఇంతకీ ఆ ఎగ్ కర్రీకి ఎంతైందో తెలుసా?
తెలుగు ప్రజలను బర్డ్ ఫ్లూ(Bird Flu) మహమ్మారి వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా చికెన్, గుడ్లు(Eggs) తినాలంటేనే ప్రజలను భయంతో పరుగులు తీస్తున్నారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు ప్రజలను బర్డ్ ఫ్లూ(Bird Flu) మహమ్మారి వణికిస్తోంది. ఈ వైరస్ కారణంగా చికెన్, గుడ్లు(Eggs) తినాలంటేనే ప్రజలను భయంతో పరుగులు తీస్తున్నారు. ఖర్చుకు భయపడకుండా మటన్ తింటున్నారు.. కానీ ఎవరూ చికెన్(Chicken) తినేందుకు ఇష్టపడటం లేదు. గత 15 రోజుల క్రితం వరకు కేజీ చికెన్ రూ.240 వరకు ఉండగా.. ప్రస్తుతం రూ.160.. కొన్ని చోట్ల ఏకంగా రూ.100 కూడా విక్రయిస్తున్నారు. సేల్స్ కూడా సగానికి పైగా తగ్గిపోయాయి. హైదరాబాద్ నగరంలో చికెన్ బిర్యానీ(Chicken Biryani)పైనా బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ పడింది. చికెన్‌ను సరైన టెంపరేచర్ వద్ద ఉడికించి తింటే ఏ ప్రమాదం ఉండదని డాక్టర్లు, నిపుణులు చెబుతున్నా.. ప్రజలు మాత్రం తినేందుకు ఇష్ట పడటం లేదు.
దీంతో చికెన్ వ్యాపారులు, ఫౌల్ట్రీ రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. హైదరాబాద్‌లోని ఓ రెస్టారెంట్(HYD Restaurant) బిల్ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బర్డ్ ఫ్లూ లేదు ఏం లేదు అని ధైర్యం చేసి రెస్టారెంట్‌కి వెళ్లి ఎగ్ కర్రీ(Egg Curry) ఆర్డర్ ఇచ్చిన కస్టమర్‌కు రెస్టారెంట్ యాజమాన్యం షాకిచ్చింది. తిన్నాక బిల్ చూసిన ఆ కస్టమర్ కండ్లు బైర్లుగమ్మాయి. కేవలం మూడు ఎగ్స్‌తో చేసిన కర్రీకి రూ.250 బిల్ వేయడంతో ఖంగుతిన్నాడు. అనంతరం బయటకొచ్చి ఆ బిల్‌ను ఫొటో తీసి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దీంతో నెటిజన్లంతా కామెంట్లతో రెచ్చిపోయారు. ఒకవైపు ‘బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న వార్తలు వస్తున్నా.. ఎగ్ కర్రీ తిన్నావ్ చూడు నువ్వు గ్రేట్ బ్రో’ అని సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు.






