High Court: తెలంగాణ కొత్త హైకోర్టు నమూనా చూశారా? ప్రాజెక్టు బాధ్యతలు వారి కంపెనీకే!

by Ramesh Naini |

తెలంగాణ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు నూతన భవనం కోసం 100 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే.

High Court: తెలంగాణ కొత్త హైకోర్టు నమూనా చూశారా? ప్రాజెక్టు బాధ్యతలు వారి కంపెనీకే!
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం (Telangana government) రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలో హైకోర్టు నూతన భవనం కోసం 100 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన (high court construction project) ప్రాజెక్ట్ వర్క్ కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం హైకోర్టు నిర్మాణ ప్రాజెక్టును (DEC Infra) డీఈసీ ఇన్‌ఫ్రాకు అప్పగించింది. దీనిని డీఈసీ ఇన్‌ఫ్రా కంపెనీ ఇటీవల ఒక ప్రకటనలో ధృవీకరించింది. ఇది హైకోర్టు నిర్మాణంలో కీలకమైన మొదటి అడుగుగా భావిస్తున్నారు. కాగా, కొత్త హైకోర్టు, న్యాయమూర్తుల నివాస సముదాయాల నిర్మాణం కోసం తాము దాదాపు రూ. 2600 కోట్లు పెట్టుబడి పెడుతున్నామని తెలంగాణ పరిశ్రమల మంత్రి డి. శ్రీధర్ బాబు గతంలో చెప్పారు.

దాదాపు 36.52 లక్షల చదరపు అడుగుల్లో నిర్మాణం చేపట్టనున్నారు. 8.4 లక్షల చదరపు అడుగుల్లో 6 అంతస్తుల్లో ప్రధాన కోర్టు భవనం ఏర్పాటు చేయనున్నారు. అలాగే ఒకేసారి 2,800 కార్లు నిలిపేలా పెద్ద పార్కింగ్‌ సదుపాయం, అత్యధునిక పద్దతిలో నిర్మాణం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా, తెలంగాణ రాష్ట్ర నూతన హైకోర్టు భవన సముదాయం నిర్మాణ నమూన ఫోటోలు నెట్టింట వైరల్‌‌గా మారాయి. ఉస్మానియా ఆర్ట్స్‌ కాలేజీకి దగ్గరి పోలికలు ఉన్నాయని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పెద్ద ప్యాలెస్‌ల ఉందని నెటిజన్లు కితాబిస్తున్నారు.

Next Story